Breaking News

విండీస్‌తో వన్డే సిరీస్‌కు బంగ్లా జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా మెహిది హసన్‌

Published on Mon, 12/02/2024 - 21:17

వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌ జట్టును ఇవాళ (డిసెంబర్‌ 2) ప్రకటించారు. రెగ్యులర్‌ కెప్టెన్‌ నజ్ముల్‌ హసన్‌ షాంటో గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ సిరీస్‌కు బంగ్లా కెప్టెన్‌గా మెహిది హసన్‌ మిరాజ్‌ వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌ జట్టును గాయాల సమస్య వేధిస్తుంది.

సీనియర్‌ ఆటగాళ్లు ముష్ఫికర్‌ రహీం, తౌహిద్‌ హ్రిదోయ్‌ గాయాల కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యారు. ఈ సిరీస్‌కు ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌, జకీర్‌ హసన్‌ను ఎంపిక చేయలేదు. ముస్తాఫిజుర్‌ తన భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వనుండటంతో స్వదేశానికి వెళ్లనున్నాడు. 

ఫామ్‌ లేమి కారణంగా జకీర్‌ హసన్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఈ జట్టులో వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ లిటన్‌ దాస్‌, పర్వేజ్‌ హొసేన్‌ ఎమోన్‌, అఫీఫ్‌ హొసేన్‌ ధృబో, హసన్‌ మహమూద్‌, తంజిమ్‌ హసన్‌ సకీబ్‌ చోటు దక్కించుకున్నారు. సీనియర్ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ కూడా ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. విండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ డిసెంబర్‌ 8, 10, 12 తేదీల్లో సెయింట్స్‌ కిట్స్‌ వేదికగా జరుగనుంది.

విండీస్‌తో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్‌ జట్టు..
మెహిది హసన్ మిరాజ్ (కెప్టెన్), లిటన్ కుమార్ దాస్ (వికెట్‌కీపర్‌), తంజిద్ హసన్ తమీమ్, సౌమ్య సర్కార్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, మహముదుల్లా, జాకర్ అలీ అనిక్, అఫీఫ్ హొస్సేన్ ధృబో, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, హసన్‌ మహమూద్‌, షొరీఫుల్‌ ఇస్లాం, తంజిమ్ హసన్ సకిబ్, నహిద్ రాణా

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు