Breaking News

తిలక్‌ వర్మ మెరిసినా...

Published on Tue, 11/26/2024 - 08:54

రాజ్‌కోట్‌: కెప్టెన్ ఠాకూర్‌ తిలక్‌ వర్మ (44 బంతుల్లో 57; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకంతో ఆకట్టుకున్నా... సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టి20 టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. గత మ్యాచ్‌లో మేఘాలయ జట్టుపై ఘనవిజయం సాధించిన హైదరాబాద్‌... గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో బెంగాల్‌ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 

మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 18.3 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. టి20ల్లో వరుసగా మూడు శతకాలు బాది రికార్డుల్లోకెక్కిన తిలక్‌ వర్మ అదే ఫామ్‌ కొనసాగిస్తూ హాఫ్‌సెంచరీతో విజృంభించగా... రాహుల్‌ బుద్ధి (30; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌) ఫర్వాలేదనిపించాడు. 

తన్మయ్‌ అగర్వాల్‌ (6) రాహుల్‌ సింగ్‌ (10), మికిల్‌ జైస్వాల్‌ (12), రవితేజ (0), ప్రతీక్‌ రెడ్డి (3), సీవీ మిలింద్‌ (0) విఫలమయ్యారు. బెంగాల్‌ బౌలర్లలో మొహమ్మద్‌ షమీ 3... షహబాజ్, కరణ్‌ లాల్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బెంగాల్‌ జట్టు 17.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి గెలిచింది. అభిõÙక్‌ పొరెల్‌ (41; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కరణ్‌లాల్‌ (46; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో రవితేజ, అనికేత్‌ రెడ్డి చెరో వికెట్‌ పడగొట్టారు. తదుపరి మ్యాచ్‌లో బుధవారం రాజస్తాన్‌తో హైదరాబాద్‌ తలపడనుంది.  

బెంగాల్‌ చేతిలో హైదరాబాద్‌ ఓటమి 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)