Breaking News

పియాస్ట్రి ‘సిక్సర్‌’

Published on Mon, 07/28/2025 - 04:30

స్పా–ఫ్రాంకోర్‌చాంప్స్‌ (బెల్జియం): ఫార్ములావన్‌ తాజా సీజన్‌లో మెక్‌లారెన్‌ డ్రైవర్‌ల జోరు సాగుతోంది. ఆస్కార్‌ పియాస్ట్రి, లాండో నోరిస్‌ మధ్య ఆధిక్యం చేతులు మారుతూ సాగిన బెల్జియం గ్రాండ్‌ప్రిలో పియాస్ట్రి విజయం సాధించాడు. ఈ సీజన్‌లో పియాస్ట్రికిది ఆరో విజయం కావడం విశేషం. ఆదివారం జరిగిన ఈ రేసులో పియాస్ట్రి నిరీ్ణత 44 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 25 నిమిషాల 22.601 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. 

మెక్‌లారెన్‌ జట్టుకే చెందిన నోరిస్‌ 1 గంట 25 నిమిషాల 26.016 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచాడు. పోల్‌ పొజిషన్‌తో రేసును ప్రారంభించిన నోరిస్‌... 3.415 సెకన్ల తేడాతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. వర్షం అంతరాయం కారణంగా షెడ్యూల్‌ కన్నా ఆలస్యంగా ప్రారంభమైన రేసులో ఫెరారీ డ్రైవర్‌ చార్లెస్‌ లెక్‌లెర్క్‌ (1 గంట 25 నిమిషాల 42.786 సెకన్లు) మూడో స్థానం దక్కించుకున్నాడు. 

నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (1 గంట 25 నిమిషాల 44.432 సెకన్లు; రెడ్‌బుల్‌) నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ (1 గంట 26 నిమిషాల 3.280 సెకన్లు; ఫెరారీ) ఏడో స్థానానికి పరిమితమయ్యాడు. 24 రేసులో తాజా సీజన్‌లో ఇప్పటి వరకు 13 రేసులు ముగియగా... డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌లో పియాస్ట్రి 266 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... నోరిస్‌ 250 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ వెర్‌స్టాపెన్‌ 185 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. తదుపరి రేసు ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఆగస్టు 3న జరుగుతుంది.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు