Breaking News

నేను గెలిచేందుకు మా వాణ్ని ఓడిపొమ్మంటానా?

Published on Fri, 12/05/2025 - 03:57

అబుదాబి: ఈ సీజన్‌ ఫార్ములావన్‌ చాంపియన్‌షిప్‌ కోసం జట్టు సహచరుడు పియా్రస్టితో ఎలాంటి మంతనాలు ఉండవని లాండో నోరిస్‌ వ్యాఖ్యానించాడు. మెక్‌లారెన్‌ డ్రైవర్లలో నోరిస్‌ 408 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్కార్‌ పియాస్ట్రి 392 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. గత ఆదివారం ఖతర్‌ గ్రాండ్‌ప్రి గెలుపొందడంతో రెడ్‌బుల్‌ రేసర్‌ వెర్‌స్టాపెన్‌ (396) రెండో స్థానంలోకి దూసుకురావడంతోనే ఈ సీజన్‌ ‘ఫార్ములా’ ఆఖరి మజిలీకి చేరింది. 

ఈ ఆదివారం జరిగే అబుదాబి గ్రాండ్‌ప్రిపై రేసింగ్‌ ప్రియుల ఆసక్తిని పెంచింది. ఈ రేసుకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో పియాస్ట్రి, వెర్‌స్టాపెన్‌లతో కలిసి నోరిస్‌ పాల్గొన్నాడు. ‘నిజాయితీగా చెబుతున్నా... గెలవాలని నాకున్నా గెలిపించేందుకు సహకరించమని అడగను. దీనికి ఆస్కార్‌ ఒప్పుకుంటాడో లేదో తెలీదు. తప్పనిసరి అని నేను భావించను’ అని నోరిస్‌ స్పష్టం చేశాడు.

 ఇద్దరు మెక్‌లారెన్‌ డ్రైవర్ల (పియాస్ట్రి, నోరిస్‌)లో నోరిస్‌కే టైటిల్‌ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంతలా అంటే అబుదాబిలో వెర్‌స్టాపెన్‌ గెలిచినా కూడా నోరిస్‌ టాప్‌–3లో ఉంటే చాలు మెక్‌లారెన్‌ జట్టు 17 ఏళ్ల తర్వాత ఫార్ములావన్‌ విజేతగా నిలుస్తుంది. 2008లో హామిల్టన్‌ తర్వాత మరే మెక్‌లారెన్‌ డ్రైవర్‌ విజేతగా నిలువలేకపోయాడు. మరోవైపు వెర్‌స్టాపెన్‌ మాట్లాడుతూ ఆఖరి రేసులో ఏమైనా జరగొచ్చని, రేసు ఆషామాïÙగా ఉండబోదని చెప్పాడు.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)