Breaking News

నోరిస్‌కు పోల్‌ పొజిషన్‌

Published on Sun, 05/25/2025 - 01:39

మొనాకో: ఫార్ములా వన్‌ సీజన్‌ తొమ్మిదో రేసు మొనాకో గ్రాండ్‌ ప్రిలో మెక్‌లారెన్‌ డ్రైవర్‌ లాండో నోరిస్‌ పోల్‌ పొజిషన్‌ సాధించాడు. ఈ క్రమంలో నోరిస్‌ ట్రాక్‌ రికార్డును తిరగరాశాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో నోరిస్‌ 1 నిమిషం 9.954 సెకన్లలో ల్యాప్‌ను పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచాడు. 2019లో లూయిస్‌ హామిల్టన్‌ టైమింగ్‌ను తాజాగా నోరిస్‌ అధిగమించాడు. ఈ సీజన్‌ ఆరంభ ఆ్రస్టేలియా గ్రాండ్‌ ప్రి తర్వాత నోరిస్‌కు ఇదే తొలి పోల్‌ పొజిషన్‌. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును అతడు తొలి స్థానం నుంచి ప్రారంభించనున్నాడు.

గతేడాది ఈ రేసులో విజేతగా నిలిచిన స్థానిక డ్రైవర్‌ చార్‌లెస్‌ లెక్‌లెర్క్‌ (1 నిమిషం 10.063 సెకన్లు; ఫెరారీ) రెండో స్థానం దక్కించుకోగా... మెక్‌లారెన్‌ జట్టుకే చెందిన ఆస్కార్‌ పియాస్ట్రి (1 నిమిషం 10.063 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది అంతగా ఆకట్టుకోలేకపోయిన ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ (1 నిమిషం 10.382 సెకన్లు) నాలుగో స్థానంలో నిలవగా... డిఫెండింగ్‌ చాంపియన్, రెడ్‌బుల్‌ రేసర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (1 నిమిషం 10.669 సెకన్లు) ఐదో ప్లేస్‌ దక్కించుకున్నాడు. 

ఈ సీజన్‌లో మెక్‌లారెన్‌ డ్రైవర్ల జోరు సాగుతుండగా... ఎనిమిది రేసులు ముగిసేసరికి డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో పియాస్ట్రి 146 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. లాండోనోరిస్‌ 133 పాయింట్లతో రెండో ప్లేస్‌లో కొనసాగుతుండగా... నాలుగు సార్లు ప్రపంచ చాంపియన్‌ వెర్‌స్టాపెన్‌ (124 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)