Breaking News

మ్యాక్స్‌వెల్‌ మెరుపు శతకం.. విండీస్‌ను చిత్తు చేసిన ఆసీస్‌

Published on Sun, 02/11/2024 - 17:43

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అడిలైడ్‌ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాక్స్‌వెల్‌ విధ్వంకర శతకంతో (55 బంతుల్లో 120; 12 ఫోర్లు, 8 సిక్సర్లు)  విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో టిమ్‌ డేవిడ్‌ (14 బంతుల్లో 31 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్‌ వార్నర్‌ (19 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్స్‌), కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (12 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. జోష్‌ ఇంగ్లిస్‌ (4) విఫలం కాగా.. స్టోయినిస్‌ 15 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. విండీస్‌ బౌలర్లలో జేసన్‌ హొల్డర్‌ 2, అల్జరీ జోసఫ్‌, రొమారియో షెపర్డ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌ చివరి వరకు పోరాడినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేయగలిగింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ రోవ్‌మన్‌ పావెల్‌ (63) అర్దసెంచరీతో రాణించగా.. ఆండ్రీ రసెల్‌ (37), జేసన్‌ హోల్డర్‌ (28 నాటౌట్‌), జాన్సన్‌ చార్లెస్‌ (24) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.

విండీస్‌ ఇన్నింగ్స్‌లో అందరూ తలో చేయి వేసినా లక్ష్యం పెద్దది కావడంతో ఓటమి తప్పలేదు. ఆసీస్‌ బౌలర్లలో స్టోయినిస్‌ 3 వికెట్లతో చెలరేగగా.. హాజిల్‌వుడ్‌, స్పెన్సర్‌ జాన్సన్‌ చెరో 2 వికెట్లు, బెహ్రెన్‌డార్ఫ్‌, జంపా తలో వికెట్‌ పడగొట్టారు. నామమాత్రపు మూడో టీ20 ఫిబ్రవరి 13న జరుగనుంది. 

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు