Breaking News

'వైభవ్ సూర్యవంశీ ఆట చూసి షాకయ్యా.. మరో స్టీవ్‌ వా'

Published on Wed, 07/01/2026 - 20:01

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ భార‌త సీనియ‌ర్ జ‌ట్టు త‌ర‌పున అరంగేట్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఐర్లాండ్ సిరీస్‌కు ఎంపికైనప్పటికి అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కలేదు. ఇప్పుడు వైభవ్ టీమిండియాతో పాటు ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాడు. 

కనీసం ఇగ్లండ్ సిరీస్‌లోనైనా ఈ చిచ్చర పిడుగును ఆడించాలని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లండ్ మాజీ వికెట్ ‍కీపర్ బ్యాటర్ మ్యాట్ ప్రయర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియా లెజెండ్ స్టీవ్ వాతో వైభవ్‌ను ప్రయర్ పోల్చాడు. వైభ‌వ్ అద్భుత‌మైన ఆట‌గాడ‌ని, ఒత్తిడిని త‌ట్టుకుని రాణించే స‌త్తా ఉంద‌ని అత‌డు కొనియాడాడు.

వైభవ్‌కు కేవలం టాలెంట్ మాత్రమే కాదు, స్టీవ్ వా తరహా మానసిక దృఢత్వం కూడా ఉంది. నామ‌మాత్ర‌పు మ్యాచ్‌ల‌లో ఆడ‌డం కాదు, క్లిష్ట స‌మ‌యాల్లో కూడా రాణించేవాడే అస‌లైన క్రికెట‌ర్‌. వైభ‌వ్‌ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన‌ దాదాపు అన్ని కీల‌క మ్యాచ్‌ల‌లోనూ స‌త్తాచాటాడు. ప్ర‌పంచం మొత్తం చూస్తున్న‌ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్, ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడిని చిత్తు చేస్తూ  మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు.

ఇదే అత‌డి స్పెషాలిటీ. వ‌ర‌ల్డ్‌క్లాస్ బౌల‌ర్లు అయిత‌న జ‌స్ప్రీత్ బుమ్రా, పాట్ క‌మిన్స్ ఎంతో అనుభవం ఉన్న ఆట‌గాళ్లే ఎదుర్కోలేక‌పోయారు. కానీ 15 ఏళ్ల కుర్రాడు వారి బౌలింగ్‌ను ఉతికారేశాడు. అత‌డికి అద్భుత‌మైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. బ్యాట్ స్పీడ్ కూడా చూడటానికి చాలా బాగుంది. వైభ‌వ్ ఖ‌చ్చితంగా భార‌త క్రికెట్‌కు ఫ్యూచ‌ర్ స్టార్ అవుతాడు అని టాక్ స్పోర్ట్స్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: ENG vs IND: భారత్‌ తుది జట్టు ఇదే! వైభవ్‌కు నో ఛాన్స్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)