Breaking News

చరిత్ర సృష్టించిన మాట్ హెన్రీ.. ఆల్‌టైమ్ రికార్డు సమం

Published on Thu, 08/07/2025 - 20:37

బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ నిప్పులు చెరిగాడు. అతడు బౌలింగ్ దాటికి పసికూన జింబాబ్వే విల్లవిల్లాడింది. తొలి ఇన్నింగ్స్‌లో హెన్రీ 5 వికెట్లతో సత్తాచాటాడు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జింబాబ్వే కేవలం 125 పరుగులకే కుప్పకూలింది.

కివీస్ బౌలర్లలో హెన్రీతో పాటు జకారీ ఫౌల్క్స్ 4 వికెట్లతో అదరగొట్టాడు. ఇక జింబాబ్వే బ్యాటర్లలో మూడేళ్ల తర్వాత జట్టులో ఎంట్రీ ఇచ్చిన బ్రెండన్ టేలర్‌(44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిసాగా(33) రాణించారు. ఈ క్రమంలో మాట్ హెన్రీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

జింబాబ్వేపై టెస్టుల్లో అత్యధిక సార్లు ఫైవ్ వికెట్ల హాల్ సాధించిన న్యూజిలాండ్ బౌలర్‌గా క్రిస్ కెయిర్న్స్ రికార్డును హెన్రీ సమం చేశాడు. కెయిర్న్స్ తన కెరీర్‌లో జింబాబ్వేపై 8 టెస్టులు ఆడి 39 వికెట్లు సాధించాడు. అందులో రెండు ఫైవ్ వికెట్ హాల్స్ ఉన్నాయి. మాట్ హెన్రీ కెరీర్‌లో ఇప్పటివరకు కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. అందులో రెండు ఫైవ్ వికెట్ హాల్స్ ఉన్నాయి.

కాగా తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన న్యూజిలాండ్‌ నిలకడగా ఆడుతోంది. 32 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 150 పరుగులు చేసింది. క్రీజులో విల్‌ యంగ్‌(69), కాన్వే(71) ఉన్నారు.
చదవండి: Asia cup 2025: ఆసియాక‌ప్ నుంచి త‌ప్పుకొన్న పాకిస్తాన్‌..?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)