Breaking News

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు సీఎస్‌కేకు బిగ్‌ షాక్‌

Published on Sun, 04/14/2024 - 13:51

ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 14) జరుగబోయే కీలక సమరానికి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ మతీశ పతిరణ గాయం కారణంగా ముంబై ​మ్యాచ్‌కు దూరం కానున్నాడు. పతిరణ గాయంపై అప్‌డేట్‌ను సీఎస్‌కే హెడ్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ వెల్లడించాడు. పతిరణ సీఎస్‌కే ఆడబోయే తదుపరి మ్యాచ్‌ సమయానికంతా కోలుకుంటాడని ఫ్లెమింగ్‌ తెలిపాడు. పతిరణ ఢిల్లీతో మ్యాచ్‌ సందర్భంగా గాయపడి, ఆతర్వాత సీఎస్‌కే ఆడిన రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. పతిరణ గైర్హజరీలో సీఎస్‌కే సన్‌రైజర్స్‌ చేతిలో ఓడి.. కేకేఆర్‌పై విజయం సాధించింది.

కాగా, ఇవాళ రాత్రి జరుగబోయే ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ బిగ్‌ ఫైట్‌ కోసం‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముంబై ఇండియన్స్‌ హోం గ్రౌండ్‌ అయిన వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. క్రికెట్‌ ఎల్‌ క్లాసికోగా పిలువబడే ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ధోని, రోహిత్‌ మెరుపుల కోసం అభిమానులు వెయ్యి కళ్లతో నిరీక్షిస్తున్నారు. 

ప్రస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఇప్పుడిప్పుడే (రెండు వరుస విజయాలు) గాడిలో పడుతుండగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రెడీ తమ జైత్రయాత్రను స్టార్ట్‌ చేసింది. 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన సీఎస్‌కే పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ముంబై 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. హెడ్‌ టు హెడ్‌ ఫైట్స్‌ విషయానికొస్తే.. ఇరు జట్లు మధ్య ఇప్పటివరకు  36 మ్యాచ్‌లు జరగగా ముంబై 20, సీఎస్‌కే 16 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)