Breaking News

కేకేఆర్‌కు భారీ షాక్‌.. రూ.18 కోట్ల ప్లేయ‌ర్ ఔట్‌?

Published on Wed, 03/11/2026 - 14:08

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌కు ముందు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు భారీ షాక్ త‌గిలే అవ‌కాశ‌ముంది. శ్రీలంక స్టార్ పేస‌ర్ మ‌తీషా ప‌తిరానా గాయం కార‌ణంగా ఐపీఎల్ సీజ‌న్ మొత్తానికి దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త డిసెంబ‌ర్‌లో జ‌రిగిన మినీ వేలంలో ప‌తిరానాను రూ.18 కోట్ల భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది.

అయితే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026 మ‌ధ్య‌లో గాయ‌ప‌డిన అత‌డు ఇంకా కోలుకోలేదు. పల్లెకెలె వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన గ్రూపు స్టేజ్ మ్యాచ్‌లో ప‌తిరాన కాలిపిక్క గాయానికి గురయ్యాడు. దీంతో అత‌డు ప్రపంచకప్ నుంచి మధ్యలోనే వైదొలిగాడు. ఈ జూనియ‌ర్ మలింగ తాజాగా త‌న గాయంపై అప్‌డేట్ ఇచ్చాడు.

తాను ఇంకా శ్రీలంక‌లోనే ఉన్నానని, కోలుకోవ‌డానికి మ‌రింత స‌మయంప‌డుతుంద‌ని బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోను ప‌తిరాన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ త‌క్కువ స‌మ‌యంలో ప‌తిరాన పూర్తి ఫిట్‌నెస్ సాధించి కేకేఆర్ క్యాంపులో చేరే సూచ‌న‌లు క‌న్పించ‌డం లేదు. 

ఒక‌వేళ ఇదే జ‌రిగితే కేకేఆర్‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. గ‌తంలో సీఎస్‌కే త‌ర‌పున ఆడిన అనుభవం ఉన్న ప‌తిరానను, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా భావించి కేకేఆర్ భారీ మొత్తాన్ని వెచ్చించింది. ఇప్పుడు టోర్నీ ఆరంభ స‌మ‌యానికి అత‌డు కోలుకోక‌పోతే ప్రత్యామ్నాయ బౌలర్ కోసం కేకేఆర్ వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఐపీఎల్‌-2026కు కేకేఆర్ జట్టు
అజింక్య రహానే, రింకూ సింగ్, అంగ్‌క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, రాహుల్ త్రిపాఠి, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, క్యామెరాన్ గ్రీన్, ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మతీష పతిరానా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మతీష పతిరానా , వైభవ్ అరోరా 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)