Breaking News

ఫైనల్‌కు ముందు మ్యాచ్ ఫిక్సింగ్ క‌లక‌లం.. కోటి ఆఫర్‌?

Published on Fri, 09/05/2025 - 18:08

యూపీ టీ20 లీగ్‌-2025.. ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకుంది.  ఈ టోర్నీలోని లీగ్ స్టేజి మ్యాచ్‌ల‌ను ఫిక్సింగ్ చేయ‌డానికి బుక్కీలు ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యం బీసీసీఐ యాంటీ క‌ర‌ప్షన్ విభాగం దృష్టికి వెళ్లింది. అనంతరం లక్నో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. 

టైమ్స్ నౌ రిపోర్ట్ ప్రకారం.. కాశీ రుద్రాస్ టీమ్ మేనేజర్ అర్జున్ చౌహాన్‌కు ‘vipss_nakrani’ అనే యూజర్ నుంచి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ మెసెజ్ వచ్చింది. అందులో తను బుకీని అని,  మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే కోటి రూపాయలతో పాటు అదనంగా 50 లక్షల రూపాయల కమిషన్ ఇస్తానని రాసి ఉందంట. వెంటనే అర్జున్ ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధ‌క విభాగానికి తెలియజేశాడు. 

ఆతర్వాత ఏసీయూ సభ్యలు బుకీ ఫోన్ నంబర్ పొందడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్‌ను కంటిన్యూ చేశారు. ఆటగాళ్లు తన సూచనలను పాటించాలని,  మ్యాచ్‌ల సమయంలో తన సహచరులతో కలిసి మైదానంలో ఉంటానని కూడా బుకీ వెల్లడించాడు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలను, కాల్‌లను మరొక ఫోన్‌లో రికార్డు చేసి పోలీస్‌లకు అధారాలగా బీసీసీఐ ఏసీయూ అప్పగించింది. దీంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ విషయాన్ని లక్నో డీసీపీ ధ్రువీక‌రించారు. కాగా యూపీ టీ20 లీగ్ విష‌యానికి వ‌స్తే.. శ‌నివారం ఫైన‌ల్ పోరులో ఎకానా స్టేడియం వేదిక‌గా కాశీ రుద్ర,  మీరట్ మావెరిక్స్ జట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)