మార్టిన్‌ గప్తిల్‌ మహోగ్రరూపం.. 11 బంతుల్లో 62 పరుగులు

Published on Thu, 10/03/2024 - 15:05

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ 2024లో భాగంగా కోణార్క్ సూర్యాస్ ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో సథరన్‌ సూపర్‌ స్టార్స్‌ ఆటగాడు మార్టిన్‌ గప్తిల్‌ మహోగ్రరూపం దాల్చాడు. ఈ మ్యాచ్‌లో గప్తిల్‌.. 54 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 131 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా సథరన్‌ సూపర్‌ స్టార్స్‌  కోణార్క్ సూర్యాస్ ఒడిశాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన  కోణార్క్ సూర్యాస్ ఒడిశా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రిచర్డ్‌ లెవి 21 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. యూసఫ్‌ పఠాన్‌ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేశాడు.

అనంతరం 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సథరన్‌ సూపర్‌ స్టార్స్‌  కేవలం 16 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మార్టిన్‌ గప్తిల్‌ ఒంటిచేత్తో  సూపర్‌ స్టార్స్‌ను గెలిపించాడు. శ్రీవట్స్‌ గోస్వామి 18, మసకద్జ 20, పవన్‌ నేగి 14 పరుగులు చేశారు.

ఒకే ఓవర్‌లో 34 పరుగులు
నవిన్‌ స్టీవర్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో మార్టిన్‌ గప్తిల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ ఓవర్‌లో గప్తిల్‌ ఐదు సిక్సర్లు, బౌండరీ సహా 34 పరుగులు పిండుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో నవిన్‌ స్టీవర్ట్‌ వేసిన మరో ఓవర్‌లోనూ గప్తిల్‌ రెచ్చిపోయాడు. ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో గప్తిల్‌ 29 పరుగులు (నాలుగు సిక్సర్లు, బౌండరీ) సాధించాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో నవిన్‌ వేసిన రెండు ఓవర్లలో గప్తిల్‌ 11 బంతులు ఎదుర్కొని 62 పరుగులు రాబట్టాడు.

నిన్న ఒకే ఓవర్‌లో 30 పరుగులు
నిన్న మణిపాల్‌ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ గప్తిల్‌ చెలరేగిపోయాడు. డేనియల్‌ క్రిస్టియన్‌ వేసిన ఓ ఓవర్‌లో 30 పరుగులు పిండుకున్నాడు. ఇందులో నాలుగు సిక్సర్లు, ఓ బౌండరీ ఉన్నాయి. ఈ మ్యాచ్‌ మొత్తంలో 29 బంతులు ఎదుర్కొన్న గప్తిల్‌ 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశారు. 

చదవండి: విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు.. ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన.. కెప్టెన్‌ రీఎంట్రీ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)