భారత్‌తో టెస్టు సిరీస్‌.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌

Published on Thu, 03/13/2025 - 19:03

స్వదేశంలో టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు గట్టిఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ గాయం కారణంగా భార‌త్‌తో సిరీస్‌కు దూర‌మ‌య్యాడు. వుడ్ ప్ర‌స్తుతం మోకాలి నొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో వుడ్ ఎడ‌మ మోకాలికి గాయ‌మైంది. 

దీంతో మ్యాచ్ మ‌ధ్య‌లోనే మైదానం నుంచి వుడ్ వైదొలిగాడు. అయితే అత‌డు కోలుకోవడానికి కనీసం నాలుగు నెల‌ల స‌మ‌యం ప‌ట్ట‌నుంది. ఈ క్ర‌మంలోనే టీమిండియాతో సిరీస్‌కు వుడ్ దూరం కానున్నాడు.  ఈ విష‌యాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సైతం ధ్రువీక‌రించాడు. అత‌డు త్వ‌ర‌లోనే త‌న మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. ఈ ఏడాది జూలై ఆఖ‌రిలో తిరిగి అత‌డు జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

కాగా మార్క్ వుడ్ కూడా త‌న గాయంపై అప్‌డేట్ ఇచ్చాడు. "గ‌త ఏడాది ఆరంభం నుంచి ఎటువంటి విరామం లేకుండా అన్నిఫార్మాట్ల‌లో ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వ‌హించాను. కానీ దుర‌దృష్టవశాత్తూ మళ్లీ గాయ పడటం నిజంగా నాకు చాలా బాధగా ఉంది.

అయితే వీలైనంత త్వరగా గాయం నుంచి కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తాను. నాకు మ‌ద్ద‌తుగా నిలిచిన వైద్యులు, కోచింగ్ స్టాప్‌, ఇంగ్లండ్ క్రికెట్‌, నా స‌హ‌చ‌రులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని వుడ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నాడు.

ఇదేమి తొలిసారి కాదు..
కాగా మార్క్ వుడ్ గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూరంగా ఉండ‌డం ఇదేమి తొలిసారి కాదు. అత‌డు త‌న కెరీర్ ఆరంభం నుంచి గాయాల‌తో సావాసం చేస్తున్నాడు. గ‌తేడాది ఆరంభంలో భార‌త్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌కు కూడా వుడ్ గాయం కార‌ణంగా దూర‌మ‌య్యాడు.

2019లో కూడా అత‌డు త‌న మోకాలికి స‌ర్జ‌రీ చేయించుకున్నాడు. ఇప్పుడు అత‌డు గాయం మ‌ళ్లీ తిర‌గ‌బెట్టింది. దీంతో మ‌రోసారి త‌న గాయానికి శ‌స్త్ర‌చికిత్స చేయించుకోనున్నాడు. కాగా వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ 2025-27లో భాగంగా భార‌త్- ఇంగ్లండ్ మ‌ధ్య ఈ టెస్టు సిరీస్ జ‌ర‌గ‌నుంది. జూన్‌లో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
చదవండి: హార్దిక్‌ పాండ్యా కంటే అతడు ఎంతో బెటర్‌: పాక్‌ మాజీ కెప్టెన్‌
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)