Breaking News

T20 WC 2026: చరిత్ర సృష్టించిన స్టోయినిస్‌

Published on Fri, 02/13/2026 - 15:36

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో స్టోయినిస్‌ ఓ వికెట్‌ సహా 6 పరుగులు చేశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అస్ట్రేలియా తరఫున 50 వికెట్లు సహా 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

ఆసీస్‌కు షాకిచ్చిన జింబాబ్వే
టీ20 ప్రపంచకప్‌ 2026లో పెను సంచలనం నమోదైంది. మాజీ ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు పసికూన జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. కొలొంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి, మైటి ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో చిత్తు చేసింది.

తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి, ఆతర్వాత ఆ లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. బ్యాటింగ్‌లో బ్రియాన్‌ బెన్నెట్‌ (64 నాటౌట్‌), బౌలింగ్‌లో బ్లెస్సింగ్‌ ముజరబానీ (4-0-17-4) చెలరేగిపోయారు. బ్యాటింగ్‌లో బెన్నెట్‌తో పాటు మరుమణి (35), ర్యాన్‌ బర్ల్‌ (35), సికందర్‌ రజా (25 నాటౌట్‌) కూడా రాణించారు.

బౌలింగ్‌లో ముజరబానీతో పాటు బ్రాడ్‌ ఈవాన్స్‌ (3.3-0-23-3), మసకద్జ (4-0-36-1), ర్యాన్‌ బర్ల్‌ (1-0-9-1), గ్రేమీ క్రీమర్‌ (4-0-33-0) కూడా సత్తా చాటారు.

ఆసీస్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. బౌలింగ్‌లో ఎల్లిస్‌ (4-0-34-0), జంపా (4-0-31-0) పరుగులు నియంత్రించినా వికెట్లు తీయలేకపోయారు. డ్వార్షుయిస్‌ (4-0-40-0)ను జింబాబ్వే బ్యాటర్లు ఉతికి ఆరేశారు. కుహ్నేమన్‌ (3-0-24-0) ప్రభావం చూపలేకపోయాడు. పార్ట్‌టైమ్‌ బౌలర్‌ మ్యాక్స్‌వెల్‌ ఒక్క ఓవర్‌కే (1-0-14-0) పరిమితమయ్యాడు. గ్రీన్‌ (1.1-0-6-1), స్టోయినిస్‌ (2.5-0-17-1) తలో వికెట్‌ తీశారు. స్టోయినిస్‌ బౌలింగ్‌ చేస్తుండగా తీవ్రంగా గాయపడి, ఓవర్‌ ముగియకుండానే మైదానాన్ని వీడాడు.

అనంతరం బ్యాటింగ్‌లో ఆసీస్‌ దారుణంగా తేలిపోయింది. ఓపెనర్లు ఇంగ్లిస్‌ 8, హెడ్‌ 17 పరుగులు చేయగా.. ఆతర్వాత వచ్చిన గ్రీన్‌, టిమ్‌ డేవిడ్‌ డకౌట్లయ్యారు. ఈ దశలో మ్యాక్స్‌వెల్‌ (31), రెన్‌షా (65) ఆసీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే జింబాబ్వే బౌలర్ల ధాటికి వీరు కూడా చేతులెత్తేశారు. ఆఖర్లో స్టోయినిస్‌ (6), డ్వార్షుయిస్‌ (6), జంపా (2), కుహ్నేమన్‌ (0) ఇలా వచ్చి, అలా పెవిలియన్‌కు వెళ్లడంతో ఆసీస్‌ ఘోర పరాజయంపాలైంది. జింబాబ్వే టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్‌ను ఓడించడం ఇదే మొదటిసారి కాదు. 2007 ఎడిషన్‌లోనూ ఆ జట్టు ఆసీస్‌ను మట్టికరిపించింది.  
 

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)