భారత ఫుట్‌బాల్‌ టీమ్‌ హెడ్‌ కోచ్‌గా మనోలో మార్క్వెజ్‌

Published on Sun, 07/21/2024 - 07:27

భారత ఫుట్‌బాల్‌ టీమ్‌కు కొత్త కోచ్‌ వచ్చాడు. స్పెయిన్‌కు చెందిన మనోలో మార్క్వెజ్‌ను టీమ్‌ హెడ్‌ కోచ్‌గా నియమిస్తున్నట్లు అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) శనివారం ప్రకటించింది. 55 ఏళ్ల మార్క్వెజ్‌ ప్రస్తుతం ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) టీమ్‌ ఎఫ్‌సీ గోవాకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.

అయితే 2024–25 సీజన్‌లో ఆయన ఇటు భారత జట్టుతో పాటు అటు ఎఫ్‌సీ గోవా కోచ్‌గా కూడా రెండు బాధ్యతలను నిర్వర్తిస్తారని ఏఐఎఫ్‌ఎఫ్‌ వెల్లడించింది. కోచ్‌గా యూఈఎఫ్‌ఏ ప్రొ లైసెన్స్‌ ఉన్న మార్క్వెజ్‌ పదవీకాలంపై ఫెడరేషన్‌ ఎలాంటి స్పష్టతనివ్వలేదు.

వియత్నాం, లెబనాన్‌లతో వచ్చే అక్టోబరులో జరిగే మూడు దేశాల టోర్నీనుంచి కొత్త కోచ్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. 2020 నుంచి భారత్‌లో మార్క్వెజ్‌ కోచింగ్‌ కొనసాగుతోంది. ఎఫ్‌సీ గోవాకు కోచ్‌గా మారక ముందు ఐఎస్‌ఎల్‌లో ఆయన హైదరాబాద్‌ ఎఫ్‌సీకి కోచ్‌గా పని చేశారు.

మార్క్వెజ్‌ నేతృత్వంలోనే 2021–22లో హైదరాబాద్‌ ఐఎస్‌ఎల్‌ చాంపియన్‌గా నిలవడం విశేషం. స్పెయిన్‌లో కోచ్‌గా మార్క్వెజ్‌ అపార అనుభవం ఉంది. పలు స్థానిక క్లబ్‌లతో పాటు లా లిగా జట్టు లాస్‌ పామాస్‌కు కూడా కోచ్‌గా పని చేశారు.   

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)