Breaking News

IPL 2024: ముంబై కెప్టెన్సీ నుంచి హార్దిక్ ఔట్‌.. ? రియాక్ట్ అయిన సెహ్వాగ్

Published on Tue, 04/02/2024 - 18:52

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. గత రెండు సీజన్లలో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓసారి ఛాంపియన్, మరోసారి రన్నరప్‌గా నిలిపిన హార్దిక్.. ఈసారి మాత్రం తన కెప్టెన్సీ మార్క్‌ చూపించలేకపోతున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో అతడి సారథ్యంలో ముంబై ఇండియన్స్‌ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.

ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ నుంచి హార్దిక్‌ పాండ్యా తప్పుకోవాలని పెద్దఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. మళ్లీ రోహిత్‌ శర్మకు జట్టు పగ్గాలను అప్పగించాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారీ కూడా చేరాడు. 

ఈ మెగా ఈవెంట్‌లో తమ తదుపరి మ్యాచ్‌కు ముందు హార్దిక్‌ పాండ్యా ముంబై  కెప్టెన్సీ నుంచి వైదొలగతాడని తివారీ జోస్యం చెప్పాడు. అంతేకాకుండా రోహిత్‌ శర్మనే తిరిగి మళ్లీ ముంబై సారథ్య బాధ్యతలు చేపడతాడని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా ముంబై ఇండియన్స్‌ తమ తదుపరి మ్యాచ్‌లో  ఏప్రిల్‌ 7న వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ విరామంలోనే ముంబై కెప్టెన్సీలో మార్పు జరుగుతుందని తివారీ చెప్పుకొచ్చాడు.

"హార్దిక్‌ పాండ్యా ప్రస్తుతం తీవ్రమైన ఒత్తడిలో ఉన్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో బౌలర్లను హార్దిక్‌ సరిగ్గా ఉపయోగించలేకపోయాడు. ఆరంభంలో బౌలర్లు విఫలమవుతున్నప్పటికి మళ్లీ వారినే ఎటాక్‌లో తీసుకువచ్చి హార్దిక్‌ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ముంబై ఇండియన్స్‌లో అద్బుతమైన బౌలర్లు ఉన్నారు. 

సరిగ్గా రోటాట్‌ చేయడంలో పాండ్యా విఫలమయ్యాడు. స్వింగ్ అవుతున్న పిచ్‌లపై బుమ్రాను కాదని తొలుత తను బౌలింగ్‌ చేయడం కూడా హార్దిక్‌ తప్పిదమే అని చెప్పుకోవాలి. హార్దిక్‌ కూడా బంతిని స్వింగ్‌ చేయగలడు. కానీ ముంబై తరపున ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో హార్దిక్‌ బౌలర్‌గా తన మార్క్‌ను చూపించలేకపోయాడు.

ముంబై తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీతో తలపడనుంది. ఈ విరామంలో ముంబై ఫ్రాంచైజీ నుంచి ఓ బిగ్‌ న్యూస్‌ వచ్చే ఛాన్స్‌ ఉంది. హార్దిక్‌ పాండ్యా తిరిగి ముంబై కెప్టెన్సీని రోహిత్‌ శర్మకు అప్పగించేస్తాడని నేను భావిస్తున్నాను.

ఎందుకంటే గతంలో కూడా చాలా ఫ్రాంచైజీలు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పుడు ముంబై కెప్టెన్సీ విషయంలో కూడా అదే జరిగే అవకాశముందని" క్రిక్‌బజ్‌ షోలో తివారీ పేర్కొన్నాడు. 

ఇదే షోలో పాల్గోన్న టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్.. మనోజ్‌ తివారీ కామెంట్స్‌పై స్పందించాడు. "హార్దిక్‌ కెప్టెన్సీపై  మనోజ్‌ కాస్త తొందపడి ఇటువంటి వ్యాఖ్యలు చేశాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రోహిత్ కెప్టెన్సీలో కూడా జట్టు వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఆ ఏడాది సీజన్‌లో వారు ఛాంపియన్‌లుగా నిలిచారు. కాబట్టి మనం కాస్త ఓపిక పట్టాలి.  మనం మరో రెండు మ్యాచ్‌ల కోసం వేచి ఉండాలి. ఆ తర్వాతే మన అభిప్రాయాలను వెల్లడిస్తే బాగుంటుందని సెహ్వాగ్ రిప్లే ఇచ్చాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)