Breaking News

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన క్రీడా మంత్రి.. 19 ఏళ్ల కెరీర్‌కు?

Published on Mon, 02/19/2024 - 11:24

టీమిండియా మాజీ క్రికెటర్‌, బెంగాల్‌ కెప్టెన్‌ మనోజ్‌ తివారీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో భాగంగా బిహార్‌తో మ్యాచ్‌ అనంతరం తన 19 ఏళ్ల కెరీర్‌కు తివారీ ముగింపు పలికాడు. ఈ క్రమంలో తన కెరీర్‌లో ఆఖరి మ్యాచ్‌ ఆడిన తివారీ బెంగాల్‌ క్రికెట్‌ ఆసోషియేషన్‌ ఆదివారం ఘనంగా సన్మినించింది.

అతడిని గోల్డెన్‌ బ్యాట్‌తో బెంగాల్‌ క్రికెట్‌ ఆసోషియేషన్‌ చైర్మెన్‌ స్నేహసిస్ గంగూలీ సత్కారించారు. ఈ సందర్భంగా తివారీ మాట్లాడుతూ.. నాకు ఇష్టమైన ఈడెన్‌ గార్డెన్స్‌లో రిటైర్మెంట్‌ అవ్వడం చాలా సంంతోషంగా ఉంది. కానీ నా కెరీర్‌లో  బెంగాల్‌కు రంజీ ట్రోఫీని అందించికపోవడం లోటుగా మిగిలిపోయిందని చెప్పుకొచ్చాడు.

కాగా తన కెరీర్‌లో 148 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన తివారీ.. 47.86 సగటుతో 10,195 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 30 సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 5,581, టీ20ల్లో 3,436 పరుగులు మనోజ్‌ చేశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరపున 12 వన్డేలు ఆడిన తివారీ 287 పరుగులు చేశాడు.

2011లో చెన్నై వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో తివారీ సెంచరీ కూడా నమోదు చేశాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా, పంజాబ్, రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌లకు ఆడాడు. కాగా రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌ ఆరంభానికి ముందే అన్ని రకాల ఫార్మాట్‌ల నుంచి తప్పు​కుంటున్నట్లు మనోజ్‌ ప్రకటించాడు.

కానీ బెంగాల్‌ క్రికెట్‌ ఆసోషియేషన్‌ చైర్మెన్‌ స్నేహసిస్ గంగూలీ సూచన మెరకు మనోజ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఒకే ఒక్కే సీజన్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుత రంజీ సీజన్‌లో తివారీ భాగమయ్యాడు. ఇక 37 ఏళ్ల తివారీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ కేబినెట్‌లో రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నాడు.
చదవండి: #Dhruv Jurel: రెప్పపాటులో.. మెరుపులా కదిలిన జురెల్‌.. ‘సెంచరీ వీరుడి’ రనౌట్‌ చూశారా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)