Breaking News

మనీశ్‌ పాండే విధ్వంసం.. కేవలం 29 బంతుల్లోనే..!

Published on Tue, 08/12/2025 - 08:46

మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీలో మైసూర్‌ వారియర్స్‌ కెప్టెన్‌ మనీశ్‌ పాండే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నిన్న (ఆగస్ట్‌ 11) బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 58 పరుగులు చేశాడు

ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన మైసూర్‌ వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మైసూర్‌ ఇన్నింగ్స్‌లో మనీశ్‌తో పాటు సుమిత్‌ కుమార్‌ (28 బంతుల్లో 44 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌), హర్షిల్‌ ధర్మాణి (31 బంతుల్లో 38; 2 ఫోర్లు, సిక్స్‌) రాణించారు. బెంగళూరు బ్లాస్టర్స్‌ బౌలర్లలో శుభాంగ్‌ హేగ్డే 3 వికెట్లతో సత్తా చాటాడు.

అనంతరం బరిలోకి దిగిన బ్లాస్టర్స్‌.. ఎల్‌ఆర్‌ కుమార్‌ (4-0-27-3), అజిత్‌ కార్తీక్‌ (3.2-0-21-3), కృష్ణప్ప గౌతమ్‌ (4-0-28-2) ధాటికి 19.2 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (66) బ్లాస్టర్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు.

కాగా, మహారాజా ట్రోఫీ అనేది కర్ణాకటలో జరిగే స్థానిక టీ20 టోర్నీ. ఈ టోర్నీ యొక్క నాలుగో ఎడిషన్‌ నిన్ననే మొదలైంది. వాస్తవానికి ఈ టోర్నీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే మహిళల వరల్డ్‌కప్‌ ఏర్పాట్లలో భాగంగా వేదికను మైసూర్‌లోని వడియార్‌ క్రికెట్‌ స్టేడియంకు మార్చారు. 

ఈ లీగ్‌లో మొత్తం 6 జట్లు పాల్గొంటుండగా.. మనీశ్‌ పాండే నేతృత్వంలోని మైసూర్‌ వారియర్స్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా ఉంది. ఈ టోర్నీ ప్రస్తుత ఎడిషన్‌లో మనీశ్‌ పాండే, మయాంక్‌ అగర్వాల్‌, కరుణ్‌ నాయర్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, దేవ్‌దత్‌ పడిక్కల్‌, అభినవ్‌ మనోహర్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లు పాల్గొంటున్నారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)