Breaking News

మహారాజా ట్రోఫీ-2025 విజేతగా మంగళూరు డ్రాగన్స్

Published on Fri, 08/29/2025 - 12:45

మహారాజా ట్రోఫీ కేఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ టీ20 టోర్నీ-2025 ఛాంపియన్స్‌గా మంగళూరు డ్రాగన్స్ నిలిచింది.  గురువారం మైసూర్‌ వేదికగా జరిగిన ఫైనల్లో 14 పరుగుల తేడాతో(విజేడి పద్దతి) హుబ్లి టైగర్‌ను ఓడించిన మంగళూరు.. తొలి మహారాజా ట్రోఫీని ముద్దాడింది.

ఈ  ఫైనల్‌ పోరులో తొలుత బ్యాటింగ్‌ చేసిన హుబ్లి టైగర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.  హుబ్లి బ్యాటర్లలో కృష్ణన్ శ్రీజిత్(52) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. తహా(27), మనోహర్‌(17) రాణించారు. మం‍గళూరు బౌలర్లలో సచిన్‌ షిండే మూడు వికెట్లు పడగొట్టగా.. మాక్నీల్ నోరోన్హా, ఆచార్య తలా రెండు వికెట్లు సాధించారు.

అనంతరం లక్ష్య చేధనలో మంగళూరు స్కోర్‌ 10.4 ఓవర్లలో 82/2 వద్ద ఉండగా వరుణుడు ఆటకు అంతరాయం కలిగించాడు. ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో విజేడి పద్దతి ద్వారా మంగళూరు డ్రాగన్స్‌కు విజేతగా నిర్ణయించారు.

అయితే ఈ విజయంలో మంగళూరు ఆటగాడు శరత్ బీఆర్‌ది కీలక పాత్ర. 155 పరుగుల లక్ష్య చేధనలో శరత్‌ దూకుడుగా ఆడాడు. కేవలం 35 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 49 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో శరత్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కగా.. దేవ్‌దత్త్‌ పడిక్కల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ సిరీస్‌ అవార్డు వరించింది. 

కాగా ఇప్పటివరకు మహారాజా ట్రోఫీలో నాలుగు సీజన్లు జరగాయి. తొలి సీజన్‌ విజేతగా గుల్బర్గా మిస్టిక్స్.. 2023, 2024 ఎడిషన్స్‌లో వరుసగా హుబ్లి టైగర్స్‌, మైసూర్‌ వారియర్స్‌ ఛాంపియన్స్‌ నిలిచారు. ఇప్పుడు మంగళూరు జట్టు సరి​కొత్త ఛాంపియన్‌గా అవతరించింది.
చదవండి: Asia cup 2025: ఈ జట్టుతో ప్రపంచకప్‌ గెలుస్తారా..? వారిద్దరిని ఎందుకు ఎంపిక చేశారు?
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)