Breaking News

భారత క్రికెట్‌లో విషాదం.. సునీల్‌ దేవ్‌ కన్ను మూత

Published on Thu, 08/03/2023 - 14:15

భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టుకు మేనేజర్‌గా పనిచేసిన సునీల్‌ దేవ్‌(75) కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గరువారం తుది శ్వాస విడిచారు.  గతంలో సునీల్‌ దేవ్‌ ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశారు. సునీల్‌ దేవ్‌ బీసీసీఐ సబ్‌ కమిటీలలో  స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్‌గా కూడా తన సేవలు అందించారు.

ముఖ్యంగా ఆయన 2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు భారత జట్టుకు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌గా వ్యవహరించారు. 2007 టీ20 ప్రపంచకప్‌ను ధోని సారధ్యంలోని భారత జట్టు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అదే విధంగా 1996లో దక్షిణాఫ్రికా పర్యటన, 2014 ఇంగ్లండ్‌ టూర్‌లో కూడా ఆయన టీమిండియాకు మేనేజర్‌గా పనిచేశారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: Virat Kohli: కోహ్లితో పాటు ప్రపంచకప్‌ గెలిచారు! ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీసర్‌ నుంచి ఇప్పుడిలా! జడ్డూను చూశారా?

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)