Breaking News

ఫెదరర్‌ మ్యాచ్‌కు ముందు నాటకీయ పరిణామం.. పిచ్చి పరాకాష్టకు

Published on Sat, 09/24/2022 - 13:01

స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ తన 24 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికాడు. లావెర్‌ కప్‌ 2022లో శుక్రవారం అర్థరాత్రి ఫెదరర్‌-నాదల్‌తో కలిసి తన చివరి మ్యాచ్‌ ఆడిన సంగతి తెలిసిందే. ఈ డబుల్స్‌ మ్యాచ్‌లో ఫెదరర్‌-నాదల్‌ జోడి ఓటమిపాలైంది. అయితే ఫెదరర్‌ మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఒక అపశృతి చోటుచేసుకుంది.  విషయంలోకి వెళితే.. సిట్సిపాస్‌, డీగో వార్ట్జ్‌మన్‌ మధ్య సింగిల్స్‌ మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్‌లో 6-1, 6-2తో సిట్సిపాస్‌ విజయం సాధించాడు.

అయితే మ్యాచ్‌లో తొలి సెట్‌ సిట్సిపాప్‌ కైవసం చేసుకున్న తర్వాత ఆటకు విరామం వచ్చింది. ఈలోగా మ్యాచ్‌ చూడడానికి వచ్చిన ఒక ఆగంతకుడు టెన్నిస్‌ కోర్టులోకి దూసుకెళ్లి అందరూ చూస్తుండగానే తన మోచేతికి నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత పిచ్చి పట్టినట్లు అరుస్తూ మంటలు ఆర్పుకున్నాడు.ఈ సమయంలో సిట్సిపాస్‌ అతని వెనకాలే ఉన్నాడు. ఈ ఉదంతంతో భయపడిన సిట్సిపాస్‌ బారీకేడ్‌ దాటి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత సెక్యూరిటీ వచ్చి అతన్ని వెళ్లిపోవాలని చెప్పినా వినిపించుకోకుండా అక్కడే కూర్చున్నాడు. దీంతో సెక్యూరిటీ అతన్ని కోర్టు నుంచి బయటకు తీసుకెళ్లారు. పోలీసులు సదరు వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత తిరిగి మ్యాచ్‌ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ వ్యక్తి ఎవరికి హాని తలపెట్టకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  టోర్నీ నిర్వాహకులు అక్కడికి  చేరుకొని అక్కడి సిబ్బందిచే టెన్నిస్‌ కోర్టును క్లీన్‌ చేయించారు. 

చదవండి: 'కోచ్‌ ఇబ్బంది పెడుతున్నారు.. తట్టుకోలేకపోతున్నాం'

ఓటమితో కెరీర్‌కు వీడ్కోలు.. ఫెదరర్‌, నాదల్‌ కన్నీటీ పర్యంతం

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)