Breaking News

ఆరోజు నేను- ధోని కాదు.. భజ్జీ గెలిపించాడు! వెటకారమెందుకు గంభీర్‌? బుద్ధుందా?

Published on Mon, 09/04/2023 - 17:11

Harbhajan Won The Match, Dhoni And I...": Gambhir: ‘‘ధోనితో కలిసి నేను మెరుగైన భాగస్వామ్యం నమోదు చేసిన మాట వాస్తవమే. అయితే, ఆరోజు నేను టీమిండియాను గెలిపించలేదు. హర్భజన్‌ ఆ పని చేశాడు. కానీ.. ఛేజింగ్‌లో ఏ బ్యాటర్‌ అయితే తన పరుగుతో లక్ష్యం పూర్తి చేశాడో అతడే జట్టును గెలిపించినట్లు భావించడం సహజం. 

నేను కూడా అదే నమ్ముతాను’’ అని టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ అన్నాడు. 2010 నాటి ఆసియా కప్‌ టోర్నీలో టీమిండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ సంగతుల ప్రస్తావన నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అయితే, గౌతీ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని అభిమానులు మండిపడుతున్నారు.

ధోని ఫ్యాన్స్‌ ఆగ్రహం
‘‘ఇది వెటకారమా? లేదంటే ఒక్కో సందర్భంలో ఒక్కోలా మాట్లాడటం నీకు అలవాటా? కాస్తైనా బుద్ధి ఉండాలి’’ అని సోషల్‌ మీడియా వేదికగా ఫైర్‌ అవుతున్నారు. కాగా ఆసియా వన్డే కప్‌-2023లో భాగంగా శ్రీలంక వేదికగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో శనివారం పాకిస్తాన్‌తో తలపడిన విషయం తెలిసిందే.

ఆ క్రెడిట్‌ భజ్జీకే ఇవ్వాలి
ఈ మ్యాచ్‌ సందర్భంగా బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ 2010 నాటి దాయాదుల పోరు దృశ్యాలను ప్లే చేసింది. ఈ క్రమంలో కామెంటేటర్‌ గంభీర్‌.. నాడు టీమిండియాను గెలిపించిన ఘనత హర్భజన్‌ సింగ్‌కే ఇవ్వాలని పేర్కొన్నాడు. కాగా ఆనాడు డంబుల్లా మ్యాచ్‌లో.. పాకిస్తాన్‌ 49.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌట్‌ అయింది.

ఈ క్రమంలో టీమిండియా 49.5 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసి మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో 83 పరుగులతో ఓపెనర్‌ గంభీర్‌ అదరగొట్టగా.. కెప్టెన్‌ ధోని 56 పరుగులతో రాణించాడు. అయితే, ఆఖరి వరకు అజేయంగా నిలిచిన ఆఫ్‌ స్పిన్నర్‌ భజ్జీ విన్నింగ్‌ రన్‌ తీశాడు.

ధోని విన్నింగ్స్‌ సిక్సర్‌ను తక్కువ చేసే విధంగా
దీంతో పాకిస్తాన్‌పై భారత్‌ గెలుపొందగా.. గంభీర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వచ్చింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ గంభీర్‌ పైవిధంగా కామెంట్‌ చేశాడు. అయితే, కొంతకాలం క్రితం.. ‘‘2011 వరల్డ్‌కప్‌ ఈవెంట్లో మనం యువరాజ్‌ సింగ్‌ ఇవ్వాల్సినంత క్రెడిట్‌ ఇవ్వలేదు.

జహీర్‌ ఖాన్‌, సురేశ్‌ రైనా, మునాఫ్‌ పటేల్‌.. సచిన్‌ టెండుల్కర్‌ అందరూ రాణించారు. కానీ ఎవరూ దాని గురించి మాట్లాడలేదు. మీడియా మొత్తం ఎంఎస్‌ ధోని సిక్సర్‌ గురించే కోడైకూసింది. వ్యక్తిగత ఆరాధన మత్తులో పడి జట్టును మరిచిపోయింది’’ అని గంభీర్‌ రెవ్‌స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు. దీంతో గౌతీ అప్పటి.. ఇప్పటి వ్యాఖ్యలను పోలుస్తూ మిస్టర్‌ కూల్‌ ధోని ఫ్యాన్స్‌ ఓ ఆట ఆడుకుంటున్నారు. 

చదవండి: 3 గోల్డెన్‌ క్యాచ్‌లు డ్రాప్‌.. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయిన నేపాల్‌ ఓపెనర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)