Breaking News

శ‌త‌క్కొట్టిన లంక బ్యాట‌ర్‌.. చిత్తుగా ఓడిన‌ పాకిస్తాన్

Published on Fri, 07/31/2026 - 17:24

సొంత‌గ‌డ్డ‌పై శ్రీలంక మ‌హిళ‌ల జ‌ట్టు గ‌ర్జించింది. డంబుల్లా వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20లో శ్రీలంక ఓపెన‌ర్ ఇమేషా దులాని (64 బంతుల్లో 101 నాటౌట్) అజేయ సెంచ‌రీ చేయ‌డంతో పాకిస్తాన్‌పై ఆరు వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. ఇమేషాకు తోడుగా కెప్టెన్ చ‌మేరి ఆట‌ప‌ట్టు (22 బంతుల్లో 39) రాణించ‌డంతో పాక్ విధించిన 177 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 19 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్‌ బౌలర్లలో న‌ష్రా సంధు 2 వికెట్లు తీసింది.

కాగా త‌న టీ20 కెరీర్‌లో తొలి సెంచ‌రీ సాధించి ఇమేషా దులాని లంక త‌ర‌ఫున టీ20 క్రికెట్‌లో సెంచ‌రీ సాధించిన రెండో మ‌హిళా క్రికెట‌ర్‌గా నిలిచింది. ఇంత‌క‌ముందు 2024లో మ‌లేషియాతో జ‌రిగిన మ్యాచ్‌లో చ‌మేరి ఆట‌ప‌ట్టు (119 నాటౌట్‌) లంక త‌ర‌ఫున శ‌త‌క్కొట్టిన తొలి వుమెన్ బ్యాట‌ర్‌గా నిలిచింది. స‌మ‌ర‌విక్ర‌మ (86 నాటౌట్‌, 2024లో ఐర్లాండ్‌పై) మూడో స్థానంలో ఉంది.

అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 176 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్లు షావాల్ జుల్ఫిక‌ర్ (41 బంతుల్లో 63) అర్ధ‌సెంచ‌రీ చేయ‌గా, మునీబా అలీ (24 బంతుల్లో 42) రాణించింది. ఎమ‌న్ నసీర్ (21), అయేషా జ‌ఫ‌ర్ (17) ప‌ర్వాలేద‌నిపించారు. 

లంక బౌల‌ర్ల‌లో క‌విషా దిల్హ‌రి 2 వికెట్లు తీయ‌గా, కాయా క‌వింది, సుగందిక‌, చ‌మోడి ప్ర‌బోద త‌లా ఒక వికెట్ తీశారు. ఇరుజ‌ట్ల మ‌ధ్య రెండో టీ20 మ్యాచ్ ఆదివారం జ‌ర‌గ‌నుంది.

 

చదవండి: CWG 2026: ఫైన‌ల్లో ప్రీతి.. బాక్సింగ్‌లో ప‌త‌కం ఖాయం

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)