Breaking News

శ్రీలంక‌ను వ‌ణికించిన జింబాబ్వే.. ఉత్కంఠ పోరులో ఓట‌మి

Published on Sat, 08/30/2025 - 07:36

జింబాబ్వే పర్యటనను శ్రీలంక విజయంతో ఆరంభించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 7 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. చివరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో ఆతిథ్య జట్టుపై లంకేయులు పై చేయి సాధించారు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో శ్రీలంక దూసుకెళ్లింది.

మదుషంక హ్యాట్రిక్‌..
కాగా 299 పరుగుల లక్ష్యఛేదనలో 49 ఓవర్లు ముగిసేసరికి జింబాబ్వే 289/5తో నిలిచింది. జింబాబ్వే విజయానికి 6 బంతుల్లో 10 పరుగులు అవసరం కాగా... ఆఖరి ఓవర్‌ వేసిన ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దిల్షాన్‌ మదుషంక (4/62) శ్రీలంకను గెలిపించాడు.

తొలి మూడు బంతులకు వరుసగా సికందర్‌ రజా (87 బంతుల్లో 92; 8 ఫోర్లు), బ్రాడ్‌ ఇవాన్స్‌ (0), రిచర్డ్‌ నరావా (0)ను అవుట్‌ చేసి ‘హ్యాట్రిక్‌’ ఖాతాలో వేసుకున్నాడు. మిగిలిన మూడు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేయగలిగిన జింబాబ్వే 7 పరుగుల తేడాతో ఓడింది.

నిశాంక, జనిత్ హాఫ్ సెంచరీలు..
అంతకుముందు శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 298 పరుగులు చేసింది. నిశాంక (92 బంతుల్లో 76; 12 ఫోర్లు), జనిత్‌ లియనాగె (47 బంతుల్లో 70 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), కమిందు మెండిస్‌ (36 బంతుల్లో 57; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.

అనంతరం లక్ష్యఛేదనలో జింబాబ్వే 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 291 పరుగులకు పరిమితమైంది. బెన్‌ కరన్‌ (90 బంతుల్లో 70; 8 ఫోర్లు), కెప్టెన్‌ సీన్‌ విలియమ్స్‌ (54 బంతుల్లో 57; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలతో సత్తా చాటారు. అయితే చివర్లో ఒత్తిడికి తట్టుకోలేకపోయిన జింబాబ్వే జట్టు పరాజయం పాలైంది. ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే జరగనుంది.
చదవండి: టైటాన్స్‌ ఓటమితో మొదలు
 

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)