Breaking News

వివేక్‌కు కోటి.. అతడికి రూ. 4 కోట్లు: ప్రభుత్వాల భారీ నజరానాలు

Published on Fri, 08/09/2024 - 17:07

భారత హాకీ క్రీడాకారుడు వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌కు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. కోటి రూపాయల రివార్డుతో సత్కరించనుంది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ వెల్లడించారు. జాతి మొత్తాన్ని గర్వపడేలా చేశారంటూ వివేక్‌తో పాటు భారత హాకీ జట్టు ఆటగాళ్లందరినీ ప్రశంసించారు.

వరుస ఒలింపిక్స్‌లో
కాగా ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. స్పెయిన్‌తో గురువారం జరిగిన ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సేన 2-1తో విజయం సాధించింది.

టోక్యో ఫలితాన్ని పునరావృతం చేస్తూ మరోసారి మెడల్‌ను కైవసం చేసుకుంది. తద్వారా 52 ఏళ్ల తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు  సాధించిన హాకీ జట్టుగా నిలిచింది. విశ్వ క్రీడల్లో హాకీలో ఘనచరిత్ర ఉన్న భారత్‌కు ఒలింపిక్స్‌లో ఇది 13వ పతకం.

వివేక్‌కు ఇప్పటికే డీఎస్పీ ఉద్యోగం
ఈ నేపథ్యంలో హాకీ ఇండియా కాంస్యం గెలిచిన జట్టులోని ఆటగాళ్లకు నజరానా ప్రకటించింది. ప్లేయర్లలో ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు, సహాయక సిబ్బందికి ఏడున్నరల లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకం అందించనున్నట్లు తెలిపింది. ఇక మ్యాచ్‌ ముగిసిన తర్వాత వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌కు ఫోన్‌ చేసిన మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌.. ‘‘అద్బుతమైన ప్రదర్శన. 

దేశం మొత్తం మిమ్మల్ని చూసి సంతోషిస్తోంది. జట్టుకు అభినందనలు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మీ అకౌంట్‌కు కోటి రూపాయలు రివార్డుగా ట్రాన్స్‌ఫర్‌ చేస్తుంది. ఇప్పటికే డిప్యూటీ సూపరింటెండ్‌ ఆఫ్‌​ పోలీసుగా మీరు పనిచేస్తున్నారు. మీకు ఈ కోటి రూపాయలు ప్రోత్సాహకంగా అందిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

అమిత్‌కు రూ. 4 కోట్లు
కాగా టోక్యోలో కాంస్యం గెలిచిన జట్టులో సభ్యుడైన వివేక్‌కు నాటి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగంతో పాటు కోటి రూపాయలు ఇచ్చింది. మరోవైపు.. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాంఝీ తమ హాకీ స్టార్‌ అమిత్‌ రోహిదాస్‌కు రూ. 4 కోట్ల నజరానా ప్రకటించారు. జట్టులోని ఇతర సభ్యులకు రూ. 15 లక్షల చొప్పున అందిస్తామని తెలిపారు.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు