ఓటమి బాధలో ఉన్న దక్షిణాఫ్రికాకు భారీ షాక్‌!

Published on Mon, 11/06/2023 - 17:51

వన్డే ప్రపంచకప్‌-2023లో సెమీఫైనల్స్‌కు ముందు దక్షిణాఫ్రికాకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ లుంగీ ఎంగిడి గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆదివారం కోల్‌కతా వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఎంగిడీ గాయపడ్డాడు. భారత ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో జడేజా కొట్టిన బంతిని అపే క్రమంలో ఎంగిడి కాలికి గాయమైంది.

దీంతో నొప్పితో విల్లావిల్లాడిన ఎంగిడీ ఓవర్‌ పూర్తి చేయకుండానే ఫీల్డ్‌ను వదిలి వెళ్లాడు. మిగిలిన ఓవర్‌ను జానెసన్‌ పూర్తి చేశాడు. తర్వాత ఎంగిడి బ్యాటింగ్‌కు వచ్చినప్పటకీ జడేజా బౌలింగ్‌లో డకౌటయ్యాడు. అయితే అతడికి రెండు వారాల విశ్రాంతి అవసరమని ప్రోటీస్‌ వైద్యబృందం సూచించినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ఎంగిడీ మిగిలిన టోర్నీకి దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా అతడికి బ్యాకప్‌గా రిలీ రూసోను దక్షిణాఫ్రికా జట్టు మేనెజ్‌మెంట్‌ భారత్‌కు రప్పించింది. అయితే ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టులో విలియమ్స్‌ రూపంలో మరో అదనపు పేసర్‌ ఉన్నాడు. ఒక వేళ ఎంగిడి దూరమైతే కోట్జే లేదా విలియమ్స్‌ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. కాగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 243 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.
చదవండి: WC 2023: బంగ్లాదేశ్‌ అప్పీలు.. మాథ్యూస్‌ అవుట్‌! అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)