Breaking News

అవేష్ సూప‌ర్ బౌలింగ్‌.. ఉత్కంఠ‌పోరులో ముంబై ఓట‌మి

Published on Fri, 04/04/2025 - 23:43

ఐపీఎల్‌-2025లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తిరిగి గెలుపు బాట ప‌ట్టింది. ఏక్నా స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో ఆఖ‌రి వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగిన మ్యాచ్‌లో 12 ప‌రుగుల తేడాతో ల‌క్నో విజ‌యం సాధించింది. 204 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 191 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. 

ఆఖ‌రి ఓవ‌ర్‌లో అవేష్ ఖాన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ముంబై విజ‌యానికి చివ‌రి ఓవ‌ర్‌లో 22 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. ఆ ఓవ‌ర్‌లో తొలి బంతినే హార్దిక్ పాండ్యా సిక్స‌ర్‌గా మ‌లిచాడు. ఆ త‌ర్వాత అవేష్ ఖాన్ సూప‌ర్ క‌మ్‌బ్యాక్ ఇచ్చాడు. ఆఖ‌రి 5 బంతుల్లో కేవ‌లం మూడు ప‌రుగులు మాత్ర‌మే అవేష్ ఇచ్చాడు.

ముంబై ఇండియ‌న్స్ బ్యాట‌ర్ల‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌(67) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. న‌మాన్ ధీర్‌(46) ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌న్పించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(28) ఆఖ‌రిలో పోరాడిన‌ప్ప‌టికి త‌న జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయాడు. ల‌క్నో బౌల‌ర్ల‌లో ఆకాష్ దీప్‌, దిగ్వేష్‌, శార్ధూల్ ఠాకూర్‌, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు. అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన ల‌క్నో సూపర్‌ జెయింట్స్‌ 8 వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు చేసింది. 

ల‌క్నో బ్యాట‌ర్ల‌లో మిచెల్ మార్ష్‌(31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 60), మార్‌క్ర‌మ్‌(53) హాఫ్ సెంచ‌రీల‌తో మెర‌వ‌గా.. డేవిడ్ మిల్ల‌ర్‌(27), బ‌దోని(27) రాణించారు. ముంబై బౌల‌ర్ల‌లో హార్ధిక్ పాండ్యా 5 వికెట్లతో చెలరేగగా.. విఘ్నేష్‌ పుత్తార్‌, బౌల్ట్‌, అశ్వినీ కుమార్ త‌లా వికెట్ సాధించారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)