Breaking News

LSG Vs MI: కుక్క కరిచిందన్న అర్జున్‌ టెండుల్కర్‌.. వీడియో వైరల్‌

Published on Tue, 05/16/2023 - 11:40

IPL 2023 LSG Vs MI- Arjun Tendulkar : ఐపీఎల్‌-2023 ప్లే ఆఫ్స్‌ రేసులో కీలకమైన మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. లక్నో వేదికగా మంగళవారం జరుగనున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌- ముంబై ఇండియన్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి.  ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. 

ముంబై నుంచి మా దోస్త్‌ వచ్చాడు
ఈ క్రమంలో లక్నో తమ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసిన ఓ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ‘‘ముంబై నుంచి మా దోస్త్‌ వచ్చాడు’’ అంటూ సోమవారం పంచుకున్న ఆ వీడియోలో అర్జున్‌ టెండుల్కర్‌ చెప్పిన విషయమే ఇందుకు కారణం.

కాగా టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ తనయుడు, బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అర్జున్‌ తాజా ఎడిషన్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఈ ముంబై ఇండియన్స్‌ ఆటగాడు  క్యాష్‌రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో తొలి వికెట్‌ తీశాడు.

ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో 92 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు అర్జున్‌ టెండుల్కర్‌. ఈ క్రమంలో లక్నోతో మ్యాచ్‌కు సిద్ధమైన.. ప్రాక్టీస్‌ సందర్భంగా జెయింట్స్‌ ఆటగాళ్లను కలిశాడు.

కుక్క కరిచింది
లక్నో యువ బౌలర్‌ యుధ్‌వీర్‌ సింగ్‌తో ముచ్చటించాడు. ఈ క్రమంలో.. అర్జున్‌ను ఆలింగనం చేసుకున్న యుధ్‌వీర్‌ ..‘ఎలా ఉన్నావు? అంతా ఓకే కదా!’’ అని అడిగాడు. ఇందుకు బదులుగా.. ‘‘కుక్క కరిచింది’’ అని సమాధానమిచ్చాడు. ‘‘అవునా ఎప్పుడు’’ అంటూ యుధ్‌వీర్‌ అడగ్గా.. ‘నిన్ననే’ అని బదులిచ్చాడు. 

ఇరగదీస్తున్నావు బ్రో
ఇక తర్వాత మొహ్సిన్‌ ఖాన్‌ను కలిసిన అర్జున్‌.. బౌలింగ్‌ ఇరదీస్తున్నావు బ్రో అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుండగా.. ‘‘అయ్యో అర్జున్‌ను కుక్క కరిచిందా? ఇది కూడా వార్తే’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు!! కాగా ప్లే ఆఫ్స్‌ రేసులో కీలకమైన మ్యాచ్‌లో అర్జున్‌కు తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చు.

లక్నోతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, క్రిస్ జోర్డాన్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, జాసన్ బహ్రెండార్ఫ్.  

చదవండి: గుజరాత్‌లో ఉన్నాను.. నాకిష్టమైన తిండి దొరకదు కదా: మహ్మద్‌ షమీ

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)