Breaking News

IPL: ల​క్నో సూపర్‌ జెయింట్స్‌కు కొత్త కోచ్‌.. ‍ప్రకటించిన ఫ్రాంఛైజీ

Published on Fri, 07/14/2023 - 20:55

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ కొత్త హెడ్‌ కోచ్‌ను నియమించుకుంది. ప్రస్తుత కోచ్‌ ఆండీ ఫ్లవర్‌ కాంట్రాక్ట్‌ 2023 సీజన్‌తో ముగియడంతో, అతని స్థానాన్ని ఆసీస్‌ మాజీ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌తో భర్తీ చేసింది. ఈ విషయాన్ని ఎల్‌ఎస్‌జీ యాజమాన్యం ఇవాళ (జులై 14) అధికారికంగా ప్రకటించింది. ఎల్‌ఎస్‌జీకి ఆండీ ఫ్లవర్‌ చేసిన సేవలను అభినందిస్తూ ఓ స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేసిన మేనేజ్‌మెంట్‌.. కొత్త కోచ్‌ పేరును ప్రకటించింది. ఫ్లవర్‌ కాంట్రాక్ట్‌ను పొడిగించేందుకు సముఖత చూపని లక్నో మేనేజ్‌మెంట్‌.. మెంటార్‌గా గౌతమ్‌ గంభీర్‌ సేవలను మాత్రం ఎక్స్‌టెండ్‌ చేసింది. గంభీర్‌తో పాటు బౌలింగ్‌ కోచ్‌గా మోర్నీ మోర్కెల్‌ను,  ఫీల్డింగ్‌ కోచ్‌గా జాంటీ రోడ్స్‌ను, అసిస్టెంట్‌ కోచ్‌గా విజయ్‌ దాహియాను కొనసాగించింది.

ఇదిలా ఉంటే, కేఎల్‌ రాహుల్‌, కృనాల్‌ పాండ్యాల నేతృత్వంలో, ఆండీ ఫ్లవర్‌ ఆధ్వర్యంలో ఎల్‌ఎస్‌జీ గత రెండు సీజన్లలో ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించింది. ఈ రెండు సీజన్లలో ఆ జట్టు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఓ పక్క తమతో పాటు ఐపీఎల్‌ ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌ ఓ సీజన్‌లో విజేతగా, మరో సీజన్‌లో రన్నరప్‌గా నిలువడంతో ఎల్‌ఎస్‌జీ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే హెడ్‌ కోచ్‌ను మార్చింది. మున్ముందు ఈ జట్టులో భారీ మార్పులు ఉంటాయన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ను కూడా తప్పించవచ్చని ప్రచారం జరుగుతుంది. ఐపీఎల్‌-2024కు మరో ఏడాది సమయం ఉంది కాబట్టి, కెప్టెన్‌ మార్పు విషయంలో ఎల్‌ఎస్‌జీ యాజమాన్యం ఎలాంటి ముందస్తు ప్రకటన చేయకపోవచ్చు.

లక్నో కొత్త కోచ్‌ విషయానికొస్తే.. 52 ఏళ్ల లాంగర్‌ ఆసీస్‌ను 2021 టీ20 వరల్డ్‌కప్‌ విజేతగా, బిగ్‌బాష్‌ లీగ్‌లో పెర్త్‌ స్కార్చర్స్‌ను మూడుసార్లు ఛాంపియన్‌గా (కోచ్‌గా) నిలబెట్టాడు. కోచ్‌గా మంచి ట్రాక్‌ రికార్డు కలిగిన లాంగర్‌ను ఎల్‌ఎస్‌జీ యాజమాన్యం ఏరికోరి ఎంచుకుంది. 1993-2007 మధ్యకాలంలో ఆసీస్‌ తరఫున 105 టెస్ట్‌లు 8 వన్డేలు ఆడిన లాంగర్‌.. సక్సెస్‌ఫుల్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. వన్డేల్లో పెద్దగా రాణించని లాంగర్‌ టెస్ట్‌ల్లో సత్తా చాటాడు. 182 ఇన్నింగ్స్‌ల్లో 23 సెంచరీలు, 30 అర్ధసెంచరీల సాయంతో 45.3 సగటున 7696 పరుగులు చేశాడు.

Videos

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)