Breaking News

'అసంపూర్ణంగా భార‌తదేశ చిత్ర‌ప‌ఠం.. ఎందుకీ వివ‌క్ష‌?'

Published on Sun, 08/02/2026 - 15:44

భార‌త మ‌హిళా బాక్స‌ర్ ల‌వ్లీనా బొర్గొహైన్ త‌న చ‌ర్య‌తో వార్త‌ల్లో నిలిచింది. గ్లాస్కోలోని ఒక రెస్టారెంట్‌లో త‌మ‌కు ఇచ్చిన నాప్కిన్‌లో భార‌తదేశ చిత్ర‌ప‌ఠం అసంపూర్తిగా ఉండ‌డంపై ల‌వ్లీనా అసంతృప్తి వ్య‌క్తం చేసింది. విష‌యంలోకి వెళితే.. గ్లాస్కో వేదిక‌గా జ‌రుగుతున్న‌ కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో భార‌త బాక్స‌ర్లు ప‌త‌కాలు సాధించిన సంతోషంలో ఆ విజ‌యాన్ని సెల‌బ్రేట్ చేసుకునేందుకు గ్లాస్కోలోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లారు. 

అక్క‌డి రెస్టారెంట్ మేనేజ్‌మెంట్ త‌మ హోట‌ల్‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా ఆట‌గాళ్ల‌కు భార‌త చిత్ర‌ప‌ఠంతో త‌యారు చేసిన ప్ర‌త్యేక‌ నాప్కిన్‌ల‌ను అందించారు. అయితే నాప్కిన్‌ను సుశితంగా ప‌రిశీలించిన బాక్స‌ర్ ల‌వ్లీనా బొర్గొహైన్ నాప్కిన్‌పై భార‌త చిత్ర‌ప‌ఠం అసంపూర్ణంగా ఉండ‌డాన్ని గ‌మ‌నించింది. నాప్కిన్‌పై ముద్రించిన చిత్ర‌ప‌ఠంలో ఈశాన్య రాష్ట్రాల‌ను చేర్చ‌క‌పోవ‌డంపై ల‌వ్లీనా అసంతృప్తి వ్య‌క్తం చేసింది. 

అయితే ఇక్క‌డా ఎలాంటి గొడ‌వ చేయ‌కుండా ల‌వ్లీనా వ్య‌వ‌హ‌రించిన తీరు రెస్టారెంట్ మేనేజ్‌మెంట్‌కు బాగా న‌చ్చింది. నాప్కిన్‌పై ముద్రించిన భార‌త చిత్ర‌ప‌ఠంలో ఈశాన్య ప్రాంతాల‌ను విస్మ‌రించ‌డం త‌న‌కు బాధ క‌లిగించింద‌ని, తమపై ఎందుకీ వివక్ష అని న‌వ్వుతూనే పేర్కొంది. వెంట‌నే దానిని సవ‌రించాల‌ని రెస్టారెంట్ యజమానులను ల‌వ్లీనా అభ్యర్థిస్తూ కోరింది. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇక కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత బాక్సర్లు స్వ‌ర్ణ వ‌ర్షం కురిపించారు. శనివారం మధ్యాహ్నం ప్రీతి పవార్‌ ఆరంభించిన గోల్డెన్‌ పంచ్‌.. రాత్రి అంకుశ్‌ పంఘల్‌ తెచ్చిన ఆఖరి బంగారు పతకం వరకూ కొనసాగింది. జాస్మిన్‌ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియ ఘంగాస్‌ , అరుంధతి చౌదరి, సచిన్‌ సివాచ్‌ కూడా పసిడి పతకాలకు గురిపెట్టగా.. ఒలింపిక్‌ మెడలిస్ట్‌ లవ్లీనా బొర్గోహైన్‌, జాదుమణి సింగ్‌, నరేందర్‌ బెర్వాల్‌ రజతాలు తీసుకొచ్చారు. 

కామన్వెల్త్‌ చరిత్రలో భారత బాక్సర్లకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 2010, 2018, 2022 ఎడిషన్లలో మూడేసి స్వర్ణాలే ఇప్పటిదాకా రికార్డు కాగా.. గ్లాస్గోలో బాక్సర్లు ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించారు. పారా అథ్లెట్‌ సోమన్‌ రాణా కూడా పసిడి పతకం అందుకోవడంతో మెగా గేమ్స్‌లో ఒకే రోజు 8 పసిడి పతకాలతో పండగ చేసుకున్న భారత్‌ పట్టికలో టాప్‌-5లోకి దూసుకొచ్చింది. ప్ర‌స్తుతం భార‌త్ 39 ప‌త‌కాలు (13 స్వ‌ర్ణం, 17 ర‌జ‌తం, 9 కాంస్యం) సాధించి ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో కొన‌సాగుతోంది.

 

Read: గుండుతో దర్శనం.. హార్దిక్‌ పాండ్యా కొత్త లుక్‌ వైరల్‌

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)