ప్ర‌పంచ క్రికెట్‌లో పెను సంచ‌ల‌నం.. లూకీ ఫెర్గూస‌న్ స‌రికొత్త‌ చరిత్ర

Published on Tue, 06/18/2024 - 07:38

టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ లాకీ ఫెర్గూసన్‌ సరి కొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్‌కప్‌-2024లో భాగంగా ట్రినిడాడ్‌  వేదికగా పాపువా న్యూగినీతో మ్యాచ్‌లో ఫెర్గూసన్‌ సంచలన ప్రదర్శన కనబరిచాడు.

ఈ మ్యాచ్‌లో ఫెర్గుసన్‌ ఎవరూ ఊహించని విధంగా తన 4 ఓవర్ల కోటాను మెయిడిన్లుగా ముగించాడు. ఫెర్గూస‌న్ 4 ఓవ‌ర్లు వేసి ఒక్క ర‌న్ కూడా ఇవ్వ‌లేదు. అంతేకాకుండా 3 వికెట్లు కూడా పడగొట్టాడు.

పసికూన పాపువా న్యూగినీ బ్యాటర్లకు ఈ కివీస్పీడ్‌ స్టార్‌ చుక్కలు చూపించాడు. అతడిని ఎదుర్కొనేందుకు న్యూగినీ బ్యాటర్లు గజగజ వణికిపోయారు. 

పపువా న్యూ గినియా ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో బంతిని అందుకున్న ఫెర్గూసన్ తొలి బంతికే వికెట్ తీసాడు. ఆ ఓవర్‌ను మెయిడిన్‌గా ముగించిన లాకీ.. ఏడో ఓవర్‌లో మరోసారి బంతిని అందుకుని రెండోసారి మెయిడిన్ చేశాడు.

మళ్లీ 12వ ఓవర్‌ బౌలింగ్ చేసిన ఫెర్గూసన్ రెండో బంతికి వికెట్ తీసి మూడో ఓవర్‌ను మెయిడిన్ చేశాడు. 14వ ఓవర్‌లో రెండో బంతికి మరో వికెట్ తీసి మరోసారి మెయిడిన్ చేశాడు.

ఇక ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఫెర్గూసన్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

ఫెర్గూసన్‌ సాధించిన రికార్డులు ఇవే..
అంతర్జాతీయ టీ20ల్లో అత్యత్తుమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా ఫెర్గూసన్‌ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు కెనడా కెప్టెన్‌ సాద్ బిన్ జ‌ఫ‌ర్ పేరిట ఉండేది.

పనామాపై సాద్ బిన్ జ‌ఫ‌ర్ 4 మెయిడిన్ ఓవ‌ర్లు వేసి 2 వికెట్లు తీశాడు. అయితే తాజా మ్యాచ్‌లో 4 మెయిడిన్‌ ఓవర్లతో పాటు 3 వికెట్లు పడగొట్టిన ఫెర్గూసన్‌.. సాద్ బిన్ జ‌ఫ‌ర్ ఆల్‌టైమ్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో  4 ఓవ‌ర్లు మెయిడిన్ వేసిన తొలి బౌల‌ర్‌గా కూడా ఫెర్గూస‌న్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ ఘనత ఎవరికి సాధ్యం కాలేదు.

అదేవిధంగా ఓవరాల్‌గా టీ20ల్లో  4కి 4 ఓవ‌ర్లు మెయిడిన్ వేసిన రెండో బౌలర్‌గా ఫెర్గూస‌న్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో కెనడా కెప్టెన్‌ సాద్ బిన్ జ‌ఫ‌ర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2021లో పనమాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో సాద్ బిన్ జ‌ఫ‌ర్ 4 ఓవర్లు మెయిడిన్‌ చేసి 2 వికెట్లు పడగొట్టాడు.
 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)