Breaking News

వాన్‌ విక్‌ మెరుపు సెంచరీ.. రైనా టీమ్‌పై ధవన్‌ జట్టు ఘన విజయం

Published on Sun, 09/22/2024 - 20:58

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ 2024 ఎడిషన్‌లో తొలి సెంచరీ నమోదైంది. తొయమ్‌ హైదరాబాద్‌తో ఇవాళ (సెప్టెంబర్‌ 23) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ గ్రేట్స్‌ ఓపెనర్‌ మోర్నీ వాన్‌ విక్‌ మెరుపు శతకం సాధించాడు. వాన్‌ విక్‌ 69 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా సురేశ్‌ రైనా సారథ్యం వహిస్తున్న తొయమ్‌ హైదరాబాద్‌పై శిఖర్‌ ధవన్‌ జట్టు గుజరాత్‌ గ్రేట్స్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 27 బంతుల్లో 44 పరుగులు చేసిన సురేశ్‌ రైనా టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. పీటర్‌ ట్రెగో 36 (నాటౌట్‌), గుర్కీరత్‌ సింగ్‌ 26, వాల్టన్‌ 17, క్లార్క్‌ 15, వర్కర్‌ 13 పరుగులు చేశారు. షాన్‌ మార్ష్‌ (1), స్టువర్ట్‌ బిన్ని (7) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. గుజరాత్‌ బౌలర్లలో ప్లంకెట్‌, మనన్‌ శర్మ, ప్రసన్న తలో రెండు వికెట్లు తీయగా.. గాబ్రియెల్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.

అనంతరం 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌.. వాన్‌ విక్‌ మెరుపు సెంచరీతో చెలరేగడంతో 19.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. వాన్‌ విక్‌ ఒంటిరి పోరాటం​ చేయగా.. శిఖర్‌ ధవన్‌ (21), లెండిల్‌ సిమన్స్‌ (20), యశ్‌పాల్‌ శర్మ (13 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హైదరాబాద్‌ బౌలర్లలో ఇసురు ఉడాన, గుర్కీరత్‌ మాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

చదవండి: రసవత్తరంగా సాగుతున్న న్యూజిలాండ్‌, శ్రీలంక టెస్ట్‌ మ్యాచ్‌

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు