చరిత్ర సృష్టించేందుకు 45 పరుగుల దూరంలో ఉన్న రూట్‌

Published on Thu, 07/10/2025 - 12:01

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య లార్డ్స్‌ వేదికగా ఇవాల్టి (జులై 10) నుంచి మూడో టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జో రూట్‌ పలు భారీ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం​ చూపని రూట్‌.. మూడో టెస్ట్‌లో చెలరేగవచ్చు. రూట్‌ గత రెండు టెస్ట్‌ల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 36.33 సగటున కేవలం 109 పరుగులు మాత్రమే చేశాడు.

నేటి నుంచి ప్రారంభం కాబోయే టెస్ట్‌లో రూట్‌ బద్దలు కొట్టే ఆస్కారం ఉన్న రికార్డులు ఇవే..!

టెస్ట్‌ల్లో భారత్‌పై 3000 పరుగులు
లార్డ్స్‌ టెస్ట్‌లో రూట్‌ 45 పరుగులు చేస్తే భారత్‌పై టెస్ట్‌ల్లో 3000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఇదే జరిగితే రూట్‌ ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.

ఇంగ్లండ్‌లో 7000 టెస్ట్‌ పరుగులు
ఈ మ్యాచ్‌లో రూట్‌ 99 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌లో 7000 టెస్ట్‌ పరుగులు పూర్తి చేసుకుంటాడు. అతి తక్కువ మంది ఈ ఫీట్‌ను సాధించారు.

టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌ తరఫున 800 ఫోర్లు
ఈ మ్యాచ్‌లో రూట్‌ మరో ఫోర్‌ కొడితే టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌ తరఫున 800 ఫోర్లు కొట్టిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. ఈ ఫీట్‌ను అలిస్టర్‌ కుక్‌ (816) ఒక్కడే సాధించాడు.

భారత్‌పై 50 క్యాచ్‌లు
ఈ మ్యాచ్‌లో రూట్‌ మూడు క్యాచ్‌లు పడితే భారత్‌పై అన్ని ఫార్మాట్లలో 50 క్యాచ్‌లు పూర్తి చేసుకుంటాడు. స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేసే రూట్‌ టెస్ట్‌ల్లో కొన్ని సందర్భాల్లో ఇంగ్లండ్‌ను క్యాచ్‌లతోనే గెలిపించాడు.

భారత్‌పై 4000 పరుగులు
ఈ మ్యాచ్‌లో రూట్‌ 33 పరుగులు చేస్తే భారత్‌పై అన్ని ఫార్మాట్లలో 4000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ ఫీట్‌ను చాలా తక్కువ మంది సాధించారు.

ఇంగ్లండ్‌లో 11000 పరుగులు
ఈ మ్యాచ్‌లో రూట్‌ 189 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌లో అన్ని ఫార్మాట్లలో 11000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ రికార్డును కూడా చాలా తక్కువ మంది సాధించారు.

కాగా, ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌, భారత్‌ తలో మ్యాచ్‌ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ గెలవగా.. రెండో టెస్ట్‌లో భారత్‌ భారీ విజయం సాధించింది. మూడో మ్యాచ్‌ ఇవాళ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది.

 

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)