Breaking News

70 అడుగుల విగ్రహం.. మెస్సీ తొలి రియాక్షన్‌ ఇదే!

Published on Sat, 12/13/2025 - 11:46

మెస్సీ.. మెస్సీ.. దేశ‌వ్యాప్తంగా ఎక్క‌డ చూసిన ఇదే పేరు వినిపిస్తోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం ది గోట్ టూర్‌లో భాగంగా భారత్‌కు చేరుకున్నాడు. శనివారం తెల్లవారుజామున 2.26 గంటలకు కోల్‌క‌తా విమానాశ్ర‌యంలో అడుగుపెట్టిన మెస్సీకి ఘన స్వాగతం లభించింది. 

తమ ఆరాధ్య ఆటగాడిని చూసేందుకు వేలాది సంఖ్యలో అభిమానులు ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చారు. మెస్సీతో పాటు అతని ఇంటర్‌ మియామీ జట్టు సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కూడా ఇండియా టూర్‌కు వచ్చారు. ది గోట్ రాకతో కోలకతా సాకర్ సిటీని తలపిస్తోంది. 

ఎక్కడ చూసిన మెస్సీ కటౌట్‌లే కన్పిస్తున్నాయి. ఈ పర్యటనలో భాగంగా మెస్సీ.. కోల్‌కతా లేక్ టౌన్‌లోని శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మెస్సీతో పాటు  బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ పాల్గోన్నారు.

అయితే తన విగ్రహాం ఏర్పాటుపై మెస్సీ చాలా సంతోషంగా ఉన్నట్లు పశ్చిమ బెంగాల్ మంత్రి, శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్ అధ్యక్షుడు సుజిత్ బోస్ తెలిపారు. "మేము ఇప్పటికే మెస్సీ మేనేజర్‌తో మాట్లాడాము. ఈ రోజు మెస్సీని కలుస్తాము. తన విగ్రహాన్ని నిర్మించేందుకు అతడు అనుమతి ఇచ్చాడు.

తన విగ్రహంపై కూడా మెస్సీ సంతోషంగా ఉన్నాడు. ఇది చాలా పెద్ద విగ్రహం. 70 అడుగుల ఎత్తు ఉంది. ప్రపంచంలో మెస్సీకి ఇంత పెద్ద విగ్రహం మరొకటి లేదు. అతడి రాకతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారని" సుజిత్ బోస్ ఎఎన్‌ఐతో పేర్కొన్నారు.



 

 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)