Breaking News

#Lionel Messi: వెక్కి వెక్కి ఏడ్చిన మెస్సీ.. వీడియో వైరల్‌

Published on Mon, 07/15/2024 - 09:31

Update: కోపా అమెరికా ఫుట్‌ బాల్‌ టోర్నీ-2024 విజేతగా అర్జెంటీనా నిలిచింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఫైనల్లో కొలంబియాను 1-0 తేడాతో ఓడించిన అర్జెంటీనా.. 16వ సారి కోపా అమెరికా కప్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌, కెప్టెన్‌ లియోనెల్‌ మెస్సీ కన్నీరు పెట్టుకున్నాడు. కోపా అమెరికా ఫుట్‌ బాల్‌ టోర్నీలో  భాగంగా కొలంబియాతో జరుగుతున్న ఫైనల్లో మెస్సీ గాయపడ్డాడు. మ్యాచ్‌ 36వ నిమిషంలో మెస్సీ చీలమండ(పాదం)కు  గాయమైంది. 

దీంతో అతడు తీవ్రమైన నొప్పితో మైదానంలో కింద పడిపోయాడు. ఆ తర్వాత ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. కొంచెం కూడా ఉపశమనం లభించలేదు. అయినప్పటకి మెస్సీ మైదానాన్ని వీడకుండా తన ఆటను కొనసాగించాడు. మ్యాచ్ హాఫ్-టైమ్ తర్వాత కూడా స్కోర్‌లేకుండా పోవడంతో తీవ్రమైన నొప్పిని భరిస్తూనే మెస్సీ తన కంటిన్యూ చేశాడు.

 అయితే నొప్పి మరింత తీవ్రం కావడంతో మ్యాచ్‌ 66వ నిమిషంలో మెస్సీ గాయం కారణంగా మైదానం నుండి బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో డగౌట్‌లో కూర్చోన్న మెస్సీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కెరీర్‌లో చివరి కోపా అమెరికా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఆడుతున్న ఈ అర్జెంటీనా స్టార్‌ వెక్కి వెక్కి ఏడ్చాడు. 

అయితే అభిమానులు మాత్రం అతడికి మద్దతుగా నిలిచారు. మెస్సీ, మెస్సీ అంటూ జేజేలు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. కాగా నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లు గోల్స్‌ సాధించలేకపోయాయి.

ప్రస్తుతం 25 నిమిషాలు  ఎక్స్‌ట్రా సమయం కేటాయించారు. అదనపు సమయంలో 15 నిమిషాలు ముగిసినప్పటకి ఇరు జట్లు గోల్స్‌ సాధించడంలో విఫలమయ్యా. ఆఖరి 10 నిమిషాల్లో గోల్స్‌ రాకపోతే ఈ మ్యాచ్‌ ఫలితాన్ని పెనాల్టీ షూట్‌ అవుట్‌లో తేల్చే అవకాశముంది.


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)