Breaking News

కోపా కప్‌ విజేతగా అర్జెంటీనా.. లియోనెల్ మెస్సీ వరల్డ్‌ రికార్డు

Published on Mon, 07/15/2024 - 13:53

కోపా అమెరికా కప్‌-2024 ఛాంపియన్స్‌గా అర్జెంటీనా నిలిచింది. ఫైనల్లో 1-0 తేడాతో కొలంబియాను ఓడించిన అర్జెంటీనా వరుసగా రెండో సారి కోపా అమెరికా కప్‌ విజేతగా నిలిచింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌ స్ట్రైకర్‌ లౌటారో సంచలన  గోల్‌తో అర్జెంటీనాను ఛాంపియన్స్‌గా నిలిపాడు. 

కాగా ఇది అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌, కెప్టెన్‌ లియోనెల్ మెస్సీకి వరుసగా మూడో అంతర్జాతీయ ట్రోఫీ కావడం గమనార్హం.  ఓవరాల్‌గా మెస్సీకి తన కెరీర్‌లో ఇది 45వ ట్రోఫీ. ఈ క్రమంలో మెస్సీ ఓ వరల్డ్‌ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

వరల్డ్‌లో అత్యధిక ట్రోఫీలు గెలుచుకున్న ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా మెస్సీ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం డాని అల్వెస్(44) పేరిట ఉండేది. తాజా విజయంతో అల్వెస్‌ ఆల్‌టైమ్‌ రికార్డును మెస్సీ బ్రేక్‌ చేశాడు. మెస్సీ కెరీర్‌లో ఫిఫా వరల్డ్‌ కప్‌ టైటిల్‌, రెండు కోపా అమెరికా టైటిల్స్‌,  ఫైనలిసిమా ట్రోఫీ, 39 క్లబ్‌ టైటిల్స్‌ ఉన్నాయి. 

ఇందులో ఎక్కువ భాగం బార్సిలోనా క్లబ్‌ నుంచి వచ్చినవే కావడం గమనార్హం. కాగా మెస్సీకి ఇదే ఆఖరి కోపా అమెరికా ఫుట్‌బాల్‌ కప్‌. అయితే ఫైనల్‌ మ్యాచ్‌లో మెస్సీ గాయపడ్డాడు.

దీంతో మ్యాచ్‌ మధ్యలోనే మైదానం నుంచి మెస్సీ వైదొలిగాడు. ఈ క్రమంలో డగౌట్‌లో మెస్సీ కన్నీటి పర్యంతమయ్యాడు. మెస్సీ మైదానంలో లేనప్పటకి తన సహచరులు మాత్రం అద్భుత విజయాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు.

 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)