Breaking News

అక్షరాలా రూ.8 వేల కోట్లు!

Published on Tue, 12/16/2025 - 04:57

న్యూఢిల్లీ: ఫుట్‌బాల్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో ఒకడైన లయోనల్‌ మెస్సీ గత మూడు రోజులుగా భారత్‌లో పర్యటిస్తున్నాడు. నాలుగు నగరాలు కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో అతని ఈవెంట్‌లు జరిగాయి. అయితే ఒక్క చోట కూడా అతను అభిమానుల కోసం ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ ఆడలేదు కదా... కనీసం సెమీ సీరియస్‌ తరహా ఆటను కూడా చూపించలేదు. 

టీ షర్ట్, ట్రాక్‌తో ఏదో పార్క్‌లో జాగింగ్‌కు వెళుతూ తన వద్దకు వచ్చిన బంతిని అవతలి వారికి ఇచి్చనట్లుగా పాస్‌లు మాత్రమే అందించాడు! కొద్దిగానైనా అతను మైదానంలో చురుగ్గా పరుగెత్తుతూ ఆడినట్లుగా కనిపించలేదు. ఫోటో సెషన్‌లు, మైదానంలో అభిమానులకు చేతులు ఊపడం, కొన్ని కిక్‌లకు మాత్రమే మెస్సీ పరిమితయ్యాడు. దీనికి బలమైన కారణం ఉంది. తన ఆటకు ఆయువుపట్టులాంటి ఎడమ పాదానికి అతను బీమా చేయించుకున్నాడు. 

ఈ బీమా విలువ అక్షరాలా 900 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 8 వేల కోట్లు)! మ్యాచ్‌ ఆడుతూ మైదానంలో అతని పాదానికి గాయమైతే బీమా సంస్థ బాధ్యత తీసుకుంటుంది. అయితే ఈ బీమాలో ఉన్న షరతుల ప్రకారం ఇది జాతీయ జట్టు (అర్జెంటీనా) లేదా తన క్లబ్‌ (ఇంటర్‌ మయామి) తరఫున ఆడుతున్నప్పుడు మాత్రమే ఈ బీమా సౌకర్యం వర్తిస్తుంది. సరదాగానైనా సరే... మరో చోట ఎక్కడైనా ఆడుతూ పొరపాటున గాయమైతే ఇది వర్తించకపోగా, న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురవుతాయి.

 భారత్‌లాంటి చోట ఏదైనా అనూహ్యం జరిగి గాయపడే ప్రమాదం ఉంటుంది కాబట్టి మెస్సీ అలాంటి సాహసం చేయలేదు! కేవలం అలా పైపై హడావిడితో అతను పర్యటన ముగించాడు. ఒకప్పుడు బాస్కెట్‌బాల్‌ దిగ్గజం మైకేల్‌ జోర్డాన్‌కు కూడా కెరీర్‌ ఆరంభంలో ఇలాంటి సమస్యే వచ్చింది. అయితే తర్వాతి రోజుల్లో కాంట్రాక్ట్‌ పునరుద్ధరణ చేసుకునే సమయానికి సూపర్‌ స్టార్‌గా మారిపోయిన అతను తనకు అనుకూలంగా ఒక క్లాజ్‌ను అందులో చేర్పించాడు. ‘లవ్‌ ఆఫ్‌ ద గేమ్‌’ అంటూ తాను ఎప్పుడైనా, ఎక్కడైనా తనకు నచి్చనట్లుగా ఆడతానని, ఎలాంటి షరతులు పెట్టరాదని, మామూలు మ్యాచ్‌లో గాయపడినా బీమా చెల్లించాల్సిందేనంటూ అతను ఒప్పందం చేసుకున్నాడు!  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)