Breaking News

ఇండియాలో మెస్సీ.. షెడ్యూల్ ఇదిగో

Published on Thu, 12/11/2025 - 15:01

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గ‌జం లియోన‌ల్‌ మెస్సీ భార‌త్ ప‌ర్య‌ట‌న‌పై క్రీడాభిమానుల్లో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. మూడు రోజుల 'ద గోట్ టూర్'లో భాగంగా డిసెంబ‌ర్ 13న భార‌త గ‌డ్డ‌పై ఆయ‌న అడుగుపెడ‌తారు. కోల్‌క‌తా, హైద‌రాబాద్‌, ముంబై, న్యూఢిల్లీ మ‌హా న‌గ‌రాల్లో మెస్సీ ప‌ర్య‌టిస్తారు. ప‌లు ర‌కాల కార్య‌క్ర‌మాల్లో పాల్గొని, ఫ్రెండ్లీ మ్యాచ్‌లు కూడా ఆడ‌తారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, సెల‌బ్రిటీల‌ను ఆయ‌న క‌లుస్తారు. కోల్‌క‌తాలో మొదలు పెట్టి ఢిల్లీలో ఆయ‌న ప‌ర్య‌ట‌న ముగుస్తుంది. మెస్సీతో పాటు రొడ్రిగో డి పాల్ (అర్జెంటీనా), ఉరుగ్వే లెజండ‌రీ స్టైక‌ర్ లూయిస్ సువాలెజ్ కూడా ఇండియాకు వ‌స్తున్నారు.

త‌మ అభిమాన ఫుట్‌బాల్ క్రీడాకారుల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసేందుకు ఇండియా ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మెస్సీని దూరం నుంచి చూడ‌డమే త‌ప్పా ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఫొటో తీసుకునే అవ‌కాశం సామాన్యుల‌కు ఉండ‌దు. ఎందుకంటే మెస్సీతో ప్ర‌త్యేకంగా ఫొటో దిగాలంటే దాదాపు 10 ల‌క్ష‌ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా 100 మందికి మాత్ర‌మే. మెస్సీ రాక‌ కోసం తెలుగు అభిమానులు అమితాస‌క్తితో వేచివున్నారు. హైద‌రాబాద్ ఉప్ప‌ల్ స్టేడియంలో అత‌డు ఆడే మ్యాచ్ ప్ర‌త్య‌క్షంగా చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈ మ్యాచ్ వీక్షించాలంటే టిక్కెట్ త‌ప్ప‌నిస‌రి. వీటి ధ‌ర‌లు రూ.1750 నుంచి రూ.13500 వ‌ర‌కు ఉన్నాయి.

మ‌రోవైపు లియోన‌ల్‌ మెస్సీ (Lionel Messi) షెడ్యూల్‌పై ఫ్యాన్స్ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. అత‌డు ఎప్పుడు ఎక్క‌డికి వెళ‌తాడ‌నే స‌మాచారం కోసం ఆన్‌లైన్‌లో శోధిస్తున్నారు. వారి కోసం మెస్సీ ఫుల్ షెడ్యూల్‌ను ఇక్క‌డ ఇస్తున్నాం.  

మెస్సీ షెడ్యూల్ ఇలా...

డిసెంబర్ 13, కోల్‌కతా
ఉదయం 1:30: కోల్‌కతాకు రాక
ఉదయం 9:30 నుండి 10:30 వరకు: అభిమానులతో ముఖాముఖి
ఉదయం 10:30 నుండి 11:15 వరకు: మెస్సీ విగ్రహం వర్చువల్‌గా ప్రారంభోత్సవం
ఉదయం 11:15 నుండి 11:25 వరకు: యువ భారతికి రాక‌
ఉదయం 11:30: షారుఖ్ ఖాన్ యువ భారతికి రాక‌
మధ్యాహ్నం 12:00: సీఎం మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీ స్టేడియానికి రాక‌
మధ్యాహ్నం 12:00 నుండి 12:30 వరకు: ఫ్రెండ్లీ మ్యాచ్, సన్మానం, సంభాషణ
మధ్యాహ్నం 2:00: హైదరాబాద్‌కు బయలుదేరడం

డిసెంబర్ 13, హైద‌రాబాద్‌
సాయంత్రం 4: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాక‌, తాజ్ ఫ‌ల‌క‌నుమా ప్యాలెస్‌కు ప‌య‌నం, మెస్సీతో మీట్ అండ్ గ్రీట్‌
రాత్రి 7: ఉప్ప‌ల్ స్టేడియానికి రాక‌, అభిమానుల‌కు ప‌ల‌క‌రింపు, ఫ్రెండ్లీ మ్యాచ్,  చిన్నారుల‌కు మెస్సీ ఫుట్‌బాల్ చిట్నాలు, స‌న్మానం, రాత్రికి ఫ‌ల‌క‌నుమా ప్యాలెస్‌లో బ‌స‌, మ‌ర్నాడు ఉద‌యం ముంబైకు ప‌య‌నం.

చ‌ద‌వండి: ర్యాంప్‌పై మెస్సీ న‌డ‌క‌

డిసెంబర్ 14, ముంబై
మధ్యాహ్నం 3:30: క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో పాడెల్ కప్‌లో పాల్గొనడం
సాయంత్రం 4:00: సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్
సాయంత్రం 5:00: వాంఖడే స్టేడియంలో కార్యక్రమం, సెల‌బ్రిటీల‌తో ఛారిటీ ఫ్యాషన్ షో

డిసెంబర్ 15, న్యూఢిల్లీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం
మధ్యాహ్నం 1:30 గంటలకు: అరుణ్ జైట్లీ స్టేడియంలో కార్యక్రమం, మినర్వా అకాడమీ ఆటగాళ్లకు సన్మానం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)