Breaking News

మెస్సీ హ్యాట్రిక్ గోల్స్‌.. అర్జెంటీనా రికార్డు విజ‌యం

Published on Wed, 06/17/2026 - 08:34

డిఫెండింగ్ చాంపియ‌న్ అర్జెంటీనా ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026ను ఘ‌నంగా ప్రారంభించింది. గ్రూప్‌-జెలో భాగంగా బుధ‌వారం అర్జెంటీనా జట్టు 3-0తో అల్జీరియాను చిత్తు చేసింది. 200వ మ్యాచ్ ఆడుతున్న అర్జెంటీనా కెప్టెన్ లియోన‌ల్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ (ఆట 17వ‌, 60వ, 76వ నిమిషం)తో మెరిశాడు. త‌ద్వారా ఫిఫా చ‌రిత్ర‌లో అత్య‌ధిక గోల్స్ కొట్టిన ఆట‌గాళ్ల జాబితాలో జ‌ర్మ‌నీ దిగ్గ‌జం మిరాస్లోవ్ క్లోజ్‌తో క‌లిసి మెస్సీ సంయుక్తంగా అగ్ర‌స్థానంలో నిలిచాడు. ఈ విజయంతో అర్జెంటీనా మూడు పాయింట్లు సాధించి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

రికార్డు స్థాయిలో ఆరో ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీకి ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. మ్యాచ్ ఆరంభం నుంచే హైపర్ యాక్టివ్‌గా కనిపించిన మెస్సీ 38 ఏళ్ల వయసులోనూ మైదానంలో పాదరసంలా పరిగెత్తాడు. 17వ నిమిషంలో ఆఫ్‌సైడ్ దిశగా వచ్చిన బంతిని మెస్సీ నేరుగా గోల్ పోస్ట్‌లోకి తరలించడంతో అర్జెంటీనా ఖాతా తెరిచింది. 

ఆ త‌ర్వాత ఆట 60వ నిమిషంలో మెస్సీ మ‌రోసారి మెరిశాడు. ఈసారి రైట్ కార్న‌ర్ నుంచి బంతిని గోల్ పోస్ట్‌లోకి త‌ర‌లించి అర్జెంటీనా ఆధిక్యాన్ని రెండుకు పెంచాడు.  అయితే ఆట 69వ నిమిషంలో అల్జీరియా గోల్ కొట్టే అవ‌కాశాన్ని మిస్ చేసుకుంది. బంతిని అందుకున్న హౌస‌మ్ ఆర్ ఎడ్జ్ ఆఫ్ ఏరియా దిశ‌గా బంతిని త‌ల‌రించాడు. కానీ అర్జెంటీనా గోల్ కీప‌ర్ బంతిని స‌మ‌ర్థంగా అడ్డుకోవ‌డంతో బంతి గోల్‌పోస్ట్ ప‌క్క నుంచి వెళ్లిపోయింది. ఆ త‌ర్వాత 76వ నిమిషంలో మ‌రో గోల్ కొట్టిన మెస్సీ హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు సృష్టించాడు. మ‌రోవైపు అల్జీరియా మాత్రం అర్జెంటీనా ముందు ఏమాత్రం నిల‌వ‌లేకపోయింది. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)