ప్రధాని మోదీకి మెస్సీ జన్మదిన కానుక

Published on Thu, 09/18/2025 - 04:06

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ  జన్మదినం (బుధవారం) సందర్భంగా క్రీడాలోకం శుభాకాంక్షలు తెలిపింది. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా... అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ 2022 ఫిఫా ప్రపంచకప్‌ గెలిచిన జెర్సీని బహుమతిగా పంపించాడు. రెండు మూడు రోజుల్లో మెస్సీ అందించిన జెర్సీని ప్రధానికి బహుకరించనున్నట్లు ప్రమోటర్‌ సతాద్రు దత్తా వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో మెస్సీ భారత్‌లో పర్యటించనున్నాడు. 

ఇందులో భాగంగా కోల్‌కతా, ముంబై, ఢిల్లీలో అతడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. ‘మెస్సీని కలిసినప్పుడు ప్రధాని 75వ పుట్టిన రోజు రానుందని చెప్పాను. దీంతో అతడు వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ జెర్సీపై తన ఆటోగ్రాఫ్‌ చేసి ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వాల్సిందిగా నాకు చెప్పాడు’ అని సతాద్రు దత్తా తెలిపారు. మెస్సీ పర్యటనలో భాగంగా... ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. 

‘గోట్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా–2025’ పేరిట మెస్సీ పర్యటన కోల్‌కతా నుంచి ప్రారంభం కానుంది. 2011లో చివరిసారిగా మెస్సీ భారత్‌లో పర్యటించాడు. వెనిజులాతో ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడేందుకు అర్జెంటీనా జట్టు అప్పట్లో కోల్‌కతాకు వచ్చింది. మరోవైపు ఈ ఏడాది నవంబర్‌లో అర్జెంటీనా జట్టు ఒక ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడేందుకు కేరళాలోపర్యటించనుందని... ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అబ్దురెహమాన్‌ వెల్లడించారు. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)