మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
వావ్ వాటే క్యాచ్.. సింగిల్ హ్యాండ్‌తో.. వీడియో వైరల్
Published on Mon, 04/04/2022 - 16:10
ఐపీఎల్-2022లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. సీఎస్‌కే ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన లివింగ్ స్టోన్ బౌలింగ్‌లో.. డ్వేన్ బ్రావో ఢిపెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బౌలర్ దిశగా వెళ్లడంతో లివింగ్‌స్టోన్ డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతమైన రిటర్న్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఒక్క సారిగా బ్రావో షాక్‌కు గురైయ్యాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. తొలుత బ్యాటింగ్‌లో 60 పరుగులు చేసిన లివింగ్ స్టోన్.. బౌలింగ్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
Liam Livingstone is living a dream!
— Ashish Pareek (@pareektweets) April 3, 2022
What a catch!#csk #CSKvsPBKS #LiamLivingstone pic.twitter.com/ClRCbTlgpJ
Tags : 1