Breaking News

వానతో ముగిసిన ఆట!

Published on Thu, 08/24/2023 - 03:09

డబ్లిన్‌: భారత జట్టు ఐర్లాండ్‌ పర్యటనకు వర్షంతో ముగింపు లభించింది. బుధవారం జరగాల్సిన మూడో టి20 మ్యాచ్‌ వాన కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది. నిర్విరామంగా కురిసిన వర్షం తెరిపినివ్వకపోవడంతో టాస్‌ వేసే అవకాశం కూడా లేకుండా పోయింది.

మధ్యలో కొద్దిసేపు వాన తీవ్రత తగ్గడంతో అంపైర్లు మైదానాన్ని పరీక్షించినా... కనీసం 5 ఓవర్ల మ్యాచ్‌ కూడా నిర్వహించే అవకాశం లేదని తేలిపోయింది. దాంతో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు మ్యాచ్‌ రద్దుపై అంపైర్లు అధికారిక ప్రకటన చేశారు. దాంతో తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచిన భారత్‌ ఖాతాలో 2–0తో సిరీస్‌ చేరింది. భారత కెప్టెన్  జస్‌ప్రీత్‌ బుమ్రాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది.  

‘చంద్రయాన్‌’ను వీక్షిస్తూ... 
మ్యాచ్‌ రోజు డబ్లిన్‌లో భారత క్రికెటర్లు టీవీలో ‘చంద్రయాన్‌–3’ ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ సమయం గడిపారు. విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రునిపై అడుగు పెట్టిన క్షణాన సంబరాలు చేసుకుంటూ భావోద్వేగంతో తమ ఆనందాన్ని ప్రదర్శించారు. మరోవైపు మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్, స్టార్‌ ప్లేయర్‌ కోహ్లి తదితరులు తమ సంతోషాన్ని ప్రకటిస్తూ ట్విట్టర్‌లో ‘ఇస్రో’కు అభినందనలు తెలియజేశారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)