Breaking News

భారీ శతకంతో కదంతొక్కిన ఆసీస్‌ ప్లేయర్‌

Published on Mon, 10/06/2025 - 13:21

ఆస్ట్రేలియా దేశవాలీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో (Sheffield Shield-2025) ఆసీస్‌ జాతీయ జట్టు ఆటగాడు, క్వీన్స్‌ల్యాండ్‌ కెప్టెన్‌ మార్నస్‌ లబూషేన్‌ (Marnus Labuschagne) భారీ శతకంతో కదంతొక్కాడు. ఈ ఎడిషన్ తొలి మ్యాచ్‌లోనే అతను ఈ ఘనత సాధించాడు. టాస్మానియాతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 206 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 160 పరుగులు చేశాడు.

గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న లబూషేన్‌ ఈ సెంచరీతో తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో తన క్లాస్‌ను మరోసారి చాటుకున్నాడు. 14 నెలల తర్వాత ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో లబూషేన్‌ చేసిన తొలి సెంచరీ ఇది. 

అతను చివరిగా 2024 జులైలో ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో గ్లామోర్గన్‌పై మూడంకెల స్కోర్‌ను చేశాడు. ఓవరాల్‌గా లబూషేన్‌కు ఇది ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 33 శతకం.

ఈ సెంచరీతో అతను యాషెస్‌ సిరీస్‌కు ముందు ఆసీస్‌ సెలెక్టర్లకు గట్టి సవాల్‌ విసిరాడు. ఈ సెంచరీ చేయకపోయుంటే యాషెస్‌ జట్టులో అతనికి స్థానం​ ఖచ్చితంగా దక్కేది కాదు. గత కొంతకాలంగా లబూషేన్‌ ఆసీస్‌ తరఫున దారుణంగా విఫలమవుతూ వస్తున్నాడు. 

గత డబ్ల్యూటీసీ సైకిల్‌లో (2023-25) అతని ప్రదర్శన మరీ తీసికట్టుగా ఉండింది. ఆ సైకిల్‌లో 20 మ్యాచ్‌ల్లో కేవలం​ 27 సగటున, ఒకే ఒక​ సెంచరీ సాయంతో పరుగులు చేశాడు. ఇది అతని కెరీర్‌ తొలినాళ్లలో ప్రదర్శనలతో పోలిస్తే చాలా తక్కువ. 

లబూషేన్‌ కెరీర్‌ ఆరంభంలో 70కి పైగా సగటుతో పరుగులు చేశాడు. ఇప్పటివరకు 58 టెస్ట్‌లు ఆడిన లబూషేన్‌.. 46.2 సగటున 12 సెంచరీల సాయంతో 4435 పరుగులు చేశాడు.

తాజా సెంచరీతో లబూషేన్‌ ఓ అరుదైన మైలురాయిని కూడా తాకాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 12000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. కెరీర్‌లో 167 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 33 సెంచరీలు, 60 అర్ద సెంచరీల సాయంతో 12000 ప్లస్‌ పరుగులు చేశాడు. 

కాగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య యాషెస్‌ సిరీస్‌ నవంబర్‌ 21 నుంచి ప్రారంభమవుతుంది. ప్రతిష్టాత్మకమైన ఈ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ జట్టును ఇదివరకే ప్రకటించగా.. ఆసీస్‌ జట్టును మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. 

చదవండి: అష్టకష్టాలు పడుతున్న బాబర్‌ ఆజమ్‌

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)