Breaking News

మెస్సీని అధిగమించిన ఎంబపే.. సెనెగల్‌పై ఫ్రాన్స్‌ గెలుపు

Published on Wed, 06/17/2026 - 03:36

ఫిఫా వరల్డ్‌కప్-2026లో ఫ్రాన్స్ స్టార్ ఫార్వర్డ్ కైలియన్‌ ఎంబపే అరుదైన ఘనత సాధించాడు. సెనెగల్‌తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో రెండు గోల్స్ నమోదు చేయడంతో వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో దిగ్గజాలు లియోనల్‌ మెస్సీ, పీలేలను అధిగమించాడు. అలాగే తన దేశం తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాడిగానూ అవతరించాడు.

ఫిఫా వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్లు:
క్లోస్‌ (జర్మనీ) – 16
రొనాల్డో (బ్రెజిల్) – 15
ముల్లర్‌ (జర్మనీ) – 14
ఎంబపే (ఫ్రాన్స్) – 14
మెస్సీ (అర్జెంటీనా) – 13
ఫోంటైన్‌ (ఫ్రాన్స్) – 13
పీలే (బ్రెజిల్) – 12

ఫ్రాన్స్‌ తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాళ్లు:
ఎంబపే – 58
గిరౌద్‌ – 57

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఎంబపే రెండు గోల్స్‌తో చెలరేగడంతో సెనెగల్‌పై ఫ్రాన్స్‌ 3-1 గోల్స్‌ తేడాతో గెలుపొందింది. న్యూజెర్సీ వేదికగా జరిగిన ఈ గ్రూప్-ఐ మ్యాచ్‌లో ఎంబపేతో పాటు ఫ్రాన్స్‌ తరఫున బ్రాడ్లే బర్కోలా మరో గోల్‌ చేశాడు.

66వ నిమిషంలో అద్భుతమైన పరుగుతో గోల్ సాధించిన ఎంబపే, ఆతర్వాత ఇంజరీ టైమ్‌లో (96వ నిమిషంలో) 25 గజాల దూరం నుంచి అద్భుత షాట్‌తో మరో గోల్ కొట్టి మ్యాచ్‌ను ఫ్రాన్స్ వైపు తిప్పేశాడు.

సెనెగల్ తరఫున ఇబ్రహీం ఎంబయే ఒక గోల్ సాధించి స్కోరు 2-1కు తగ్గించినా, వెంటనే ఎంబపే మెరుపు గోల్‌తో ఫ్రాన్స్ విజయాన్ని ఖాయం చేశాడు.

మ్యాచ్ మొత్తం ఎంబపే ఆధిపత్యం కనిపించింది. అతడు అత్యధికంగా నాలుగు షాట్లు ప్రయత్నించడమే కాకుండా, ప్రత్యర్థి బాక్స్‌లో ఏడు సార్లు బంతిని తాకాడు. ఈ మ్యాచ్‌లో ఎంబపే కెప్టెన్‌గానూ ఆకట్డుకున్నాడు. ఈ విజయంతో ఫ్రాన్స్ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు