Breaking News

వెస్టిండీస్‌ను చిత్తు చేసిన శ్రీలంక

Published on Thu, 06/04/2026 - 08:37

వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో శ్రీలంక జట్టు శుభారంభం చేసింది. బుధ‌వారం కింగ్‌స్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో విండీస్‌పై 41 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. ఈ గెలుపుతో లంక జట్టు మూడు వన్డేల సిరీస్‌లో  1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ తొలుత శ్రీలంక‌ను బ్యాటింగ్‌కు అహ్హ‌నించాడు. 

దీంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన లంకేయులు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల నష్టానికి 303 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఓపెనర్ పతుమ్ నిస్సాంక (79 పరుగులు, 103 బంతుల్లో), వికెట్ కీపర్ బ్యాటర్ కుసాల్ మెండిస్ (72 పరుగులు, 62 బంతుల్లో) హాఫ్ సెంచ‌రీలతో స‌త్తాచాట‌గా.. చరిత్‌ అసలంక(45), జనిత్‌ లియాంగే(44) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. విండీస్‌ బౌలర్లలో జైడన్‌ సీల్స్‌, మాథ్యూ ఫోర్డ్‌, ఛేజ్‌ తలా రెండు వికెట్లు సాధించారు. 

304 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. 49.2 ఓవర్లలో 262 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ షాయ్ హోప్ (56) , గ్రీవ్స్‌(45) రాణించగా, మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. లంక పేసర్ దుష్మంత చమీర 4 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు తీక్షణ రెండు, హసరంగ, అసలంక తలా వికెట్‌ సాధించారు. కుశాల్‌ మెండిస్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇక ఇరు జట్లు రెండో వన్డే ఇదే వేదికలో ఆదివారం జరగనుంది.
చదవండి: సూర్యకుమార్‌కు భారీ షాక్‌.. టీమిండియా కెప్టెన్‌గా తెలుగోడు!

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)