Breaking News

కుశాల్‌ మెండిస్‌ రికార్డు సెంచరీ.. శ్రీలంకదే వన్డే సిరీస్‌

Published on Wed, 07/09/2025 - 08:13

పల్లెకెలె: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన శ్రీలంక జట్టు... బంగ్లాదేశ్‌పై వన్డే సిరీస్‌ కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన చివరి వన్డేలో శ్రీలంక 99 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా 2–1తో సిరీస్‌ చేజిక్కించుకుంది. అంతకుముందు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను సైతం ఆతిథ్య లంక జట్టు 1–0తో గెలుచుకుంది.

మూడో వన్డేలో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. వికెట్‌ కీపర్‌ కుశాల్‌ మెండిస్‌ (114 బంతుల్లో 124; 18 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కగా... కెప్టెన్‌ అసలంక (68 బంతుల్లో 58; 9 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. ఓపెనర్‌ పాథుమ్‌ నిసాంక (35) ఫర్వాలేదనిపించాడు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో తస్కీన్‌ అహ్మద్, మెహదీ హసన్‌ మిరాజ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్‌ 39.4 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. తౌహిద్‌ హృదయ్‌ (78 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకంతో పోరాడగా... కెప్టెన్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ (28), పర్వేజ్‌ (28), జాకీర్‌ అలీ (27) మెరుగైన ఆరంభాలను వృథా చేసుకున్నారు. శ్రీలంక బౌలర్లలో అశిత ఫెర్నాండో, దుశ్మంత చమీరా చెరో 3 వికెట్లు పడగొట్టగా... దునిత్‌ వెల్లలాగె, వణిండు హసరంగా రెండేసి వికెట్లు తీశారు.

ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలుపొందాయి. కుశాల్‌ మెండిస్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’అవార్డులు దక్కాయి. మెండిస్‌ ఈ సిరీస్‌లో తొలి వన్డేలో 45, రెండో వన్డేలో 56, ఇప్పుడు మూడో వన్డేలో 124 పరుగులు చేశాడు. ఈ సెంచరీ కుసాల​్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో 16వది. 

ఈ మ్యాచ్‌లో కుసాల్‌ మరో రికార్డు కూడా సాధించాడు. బంగ్లాదేశ్‌పై 2000 పరుగులు (అన్ని ఫార్మాట్లలో) పూర్తి చేసిన రెండో శ్రీలంకన్‌గా నిలిచాడు. గతంలో కుమార్‌ సంగక్కర (3090) ఒక్కడే ఈ ఘనత సాధించాడు. ఇరు జట్ల మధ్య గురువారం తొలి టి20 జరగనుంది.   
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)