Breaking News

SL vs NZ: మెండిస్ సూపర్ ఇన్నింగ్స్‌.. కివీస్‌పై శ్రీలంక విజయం

Published on Mon, 11/18/2024 - 09:59

ప‌ల్లెక‌లె వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. దీంతో మూడు వ‌న్డేల‌ సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2–0తో ఆతిథ్య శ్రీలంక సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 45.1 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌటైంది.

మార్క్‌ చాప్‌మన్‌ (81 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మిచెల్‌ హే (62 బంతుల్లో 49; 4 ఫోర్లు) రాణించారు. శ్రీలంక బౌలర్లలో వాండర్సే, తీక్షణ చెరో 3 వికెట్లు తీయగా, అసిత ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 210 పరుగుల సులువైన లక్ష్యాన్ని చేధించేందుకు లంకేయులు తీవ్రంగా శ్రమించారు. చివరకు 46 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి  210 పరుగులు చేసి గెలిచింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కుశాల్‌ మెండీస్‌ (102 బంతుల్లో 74 నాటౌట్‌; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా... మిగతావారిలో ఓపెనర్‌ నిసాంక (28; 4 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (5), కమిండు (0), కెపె్టన్‌ అసలంక (13), సమరవిక్రమ (8) విఫలమవడంతో లంక 163 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.

83 బంతుల్లో 47 పరుగులు చేయాల్సివుండగా... కుశాల్, మహీశ్‌ తీక్షణ (44 బంతుల్లో 27 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అబేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు అవసరమైన 47 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. బ్రాస్‌వెల్‌ 4, సాంట్నర్, ఫిలిప్స్, స్మిత్‌ తలా ఒక వికెట్‌ తీశారు. మంగళవారం ఇదే వేదికపై ఆఖరి వన్డే జరుగనుంది. కాగా 2012 తర్వాత కివీస్‌పై శ్రీలంక వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి.
చదవండి: రోహిత్‌ వచ్చినా అతడినే కెప్టెన్‌గా కొనసాగించండి: హర్భజన్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)