ఇంగ్లండ్‌ గడ్డపై కుల్దీప్‌ మెరుపులు

Published on Thu, 07/30/2026 - 12:19

భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్ గడ్డపై మెరుపులు మెరిపిస్తున్నాడు. అక్కడి వన్డే కప్‌లో యార్క్‌షైర్ కౌంటీ తరఫున నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

టోర్నీ తొలి మ్యాచ్‌లో గ్లామోర్గన్‌పై 10 ఓవర్లు బౌలింగ్ చేసి 39 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇది కుల్దీప్‌కు వన్డే కౌంటీల్లో అరంగేట్రం మ్యాచ్‌.

అనంతరం రెండో మ్యాచ్‌లో సస్సెక్స్‌పై 6.5 ఓవర్లలో 58 పరుగులు ఇచ్చి మరోసారి రెండు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆతర్వాత వోర్సెస్టర్‌షైర్‌పై మూడోసారి రెండు వికెట్ల ప్రదర్శన (2-34) నమోదు చేసి టూ వికెట్స్‌ హ్యాట్రిక్‌ సాధించాడు.

కుల్దీప్‌ వరుస సక్సెస్‌లతో దూసుకుపోవడంతో అతడి జట్టు యార్క్‌షైర్‌ కూడా మంచి విజయాలు సాధిస్తుంది. ఇంగ్లండ్ పరిస్థితులకు త్వరగా అలవాటు పడిన కుల్దీప్‌ యార్క్‌షైర్ బౌలింగ్ విభాగానికి కీలక బలంగా మారాడు.

2027 వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక దృష్ట్యా ఈ ప్రదర్శనలు కుల్దీప్‌ ఎంతో సానుకూలత కలగజేస్తాయి. కుల్దీప్‌కు ఇటీవలికాలంలో టీమిండియా తరఫున పెద్దగా అవకాశాలు రావడం లేదు.

ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతడు జట్టులో ఉన్నా, ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. తాజాగా జింబాబ్వే టీ20 సిరీస్‌లోనూ అవకాశం దక్కలేదు.

దీంతో కుల్దీప్‌ తనను తాను నిరూపించుకునేందుకు ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌ బాట పట్టాడు. కుల్దీప్‌ టీమిండియాలో అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, వాషింగ్టన్‌ సుందర్‌, హర్ష్‌ దూబే, రవి బిష్ణోయ్‌ తదితర స్పిన్నర్ల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాడు. వైవిధ్యభరితమైన చైనామన్‌ శైలి కూడా అతడికి అవకాశాలు తెచ్చిపెట్టడం లేదు. 
 

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)