కుల్దీప్‌ మాయాజాలం.. 248 పరుగులకు వెస్టిండీస్‌ ఆలౌట్‌

Published on Sun, 10/12/2025 - 13:08

వెస్టిండీస్ ఆట తీరు ఏ మాత్రం మార‌లేదు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతున్న రెండో టెస్టులో విండీస్ బౌల‌ర్ల‌తో పాటు బ్యాట‌ర్లు కూడా తేలిపోయారు. భార‌త బౌల‌ర్ల ధాటికి విండీస్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 248 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

క‌నీసం ఫాల్ ఆన్ కూడా క‌రేబియ‌న్ జ‌ట్టు దాట‌లేక‌పోయింది. 140/4 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఛేజ్ సేన అద‌నంగా 108 ప‌రుగులు మాత్ర‌మే చేసి త‌మ ఇన్నింగ్స్‌ను ముగించింది. 

భార‌త స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్‌ ఐదు  వికెట్లు ప‌డ‌గొట్టి ప‌ర్యాట‌క జ‌ట్టు ప‌త‌నాన్ని శాసించాడు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు విండీస్‌ బ్యాటర్లు విల్లవిల్లాడారు. మూడో రోజు ఆట ఆరంభం నుంచే యాదవ్‌ బంతితో మాయ చేశాడు. అతడితో పాటు ర‌వీంద్ర జ‌డేజా మూడు, జ‌స్ప్రీత్ బుమ్రా, మహ్మ‌ద్ సిరాజ్ త‌లా వికెట్ సాధించారు. 

భార‌త్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 270 ప‌రుగుల భారీ ఆధిక్యం ల‌భించింది. మరోసారి విండీస్‌ బ్యాటింగ్‌కు దిగనుంది. ఇన్నింగ్స్‌ తేడాతో భారత్‌ గెలిచేందుకు ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కనీసం రెండో ఇన్నింగ్స్‌లోనైనా టీమిండియాకు విండీస్‌ పోటీ ఇస్తుందో లేదో ఎదురు చూడాలి.

అంత‌కుముందు భార‌త్ త‌మ తొలి ఇన్నింగ్స్‌ను 518 పరుగుల భారీస్కోరు వద్ద క్లేర్‌ చేసింది. యశస్వి జైశ్వాల్ (177), శుభ్‌మన్ గిల్(129) భారీ శతకాలతో కదం తొక్కగా..నితీశ్‌ (54 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), జురేల్‌ (79 బంతుల్లో 44; 5 ఫోర్లు), సాయిసుదర్శన్‌(87) రాణించారు.
చదవండి: మా బౌలర్లను మరి అంతలా కొట్టకు జైశ్వాల్‌: బ్రియన్‌ లారా

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)