సఫారీలు కుమ్మేశారు..!

Published on Sun, 11/23/2025 - 15:30

గువహటి వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 489 పరుగుల భారీ స్కోరు సాధించింది. 247/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోపు ఆట ప్రారంభించిన సఫారీలు..  నాలుగు వందల మార్కును సునాయాసంగా దాటారు. ఈరోజు(ఆదివారం, నవంబర్‌ 23వతేదీ) బ్యాటింగ్‌లో సెనురన్ ముత్తుసామి సెంచరీ నమోదు చేశాడు.  ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ముత్తుసామి 206 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 2 సిక్స్‌లు సాయంతో 109 పరుగులు సాధించాడు. 

ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన కైల్ వెర్రెయెన్నె మార్కో జాన్సెన్‌లు సైతం ఆకట్టుకున్నారు. వెర్రెయెన్నె 45 పరుగులు సాధించగా, జాన్సెన్‌ 93 పరుగులు చేశాడు. జాన్సెన్‌ 91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో చెలరేగి ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో ఏడో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం, ఎనిమిదో వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం లభించడంతో  సఫారీలు భారీ స్కోరు నమోదు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు సాధించగా,రవీంద్ర జడేజా, బుమ్రా, సిరాజ్‌లు తలో రెండు వికెట్లు దక్కాయి.  చివరి వికెట్‌గా పెవిలియన్‌ చేరిన జాన్సెన్‌ తృటిలో సెంచరీ కోల్పోయాడు. భానత బౌలర్లలో కుల్దీప్‌ 115 పరుగులు సమర్పించుకోగా, సిరాజ్‌ 106 పరుగులు ఇచ్చాడు. 25 ఓవర్లు మించి వేసిన బౌలర్లలో బుమ్రా ఒక్కడే కుదురుగా పరుగులు ఇచ్చాడు. బుమ్రా 32 ఓవర్లు వేసి 75 పరుగులు ఇచ్చాడు. 

అనంతరం తొలి    ఇన్నిం గ్స్‌ ఆరంభించిన భారత్‌.. ఆట ముగిసే సమయానికి  వికెట్‌ నష్టపోకుండా 9 పరుగులు చేసింది.  జైశ్వాల్‌(7 బ్యాటింగ్‌), రాహుల్‌(2 బ్యాటింగ్‌)క్రీజ్‌లో  ఉన్నారు.

 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)